సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మే 2020 (13:36 IST)

ఏపీలో జూన్ 11 వరకు వేసవి సెలవులు- కొత్త 62 కరోనా కేసులు

Students
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గట్లేగు. డబుల్ డిజిట్స్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 62 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 1525కు చేరింది. ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడి 33 మంది మృతి చెందారు. 
 
మే రెండో తేదీ శనివారం ఉదయానికి 62 కేసులు నమోదైనాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 1051 మంది చికిత్స పొందుతున్నారు. 441 మంది బాధితులు ఈ వైరస్ బారిన పడి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఈ నేపథ్యంలో ఏపీలో జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు జూన్‌ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలన్నిటినీ ఇప్పటికే మూసి ఉంచిన సంగతి తెలిసిందే. 
 
క్యాలెండర్‌ ఇయర్‌ ప్రకారం జూన్‌ 11 వరకు వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే స్కూళ్లను ఆ తేదీ తరువాత మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారనేది కోవిడ్‌-19 పరిస్థితిని అనుసరించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తేదీలను తర్వాత ప్రకటిస్తామని పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.