టమోటా గుజ్జుతో అందం సొంతం... ఏం చేయాలంటే?

శుక్రవారం, 2 నవంబరు 2018 (21:20 IST)
నిత్యయవ్వనులుగా ఎప్పుడూ కనిపించాలనుకుంటున్నారా... అయితే టమోటా జ్యూస్, సూప్ వంటివి తీసుకుంటే చాలునని తాజా అధ్యయనంలో తేలింది. వయసు మీద పడటంతో ఏర్పడే ముడతలకు చెక్ పెట్టాలంటే టమోటా గుజ్జుతో ప్యాక్ వేసుకుంటే సరిపోతుందని లండన్‌లోని రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసన్ కళాశాల నిర్వహించిన పరిశోధనలో తేలింది.
 
1. ఎర్రని టమోటాల గుజ్జును ముఖానికి ప్యాక్ వేసుకోవడమే గాకుండా.. క్రమంతప్పకుండా టమోటా జ్యూస్ తాగడం, వంటల్లో అధికంగా టమోటాలను చేర్చడంతో మహిళల అందం మరింత పెరుగుతుంది.
 
2. టమోటోను తీసుకొని వాటిని బాగా గుజ్జులా తయారుచేసి అందులో కొద్దిగా ఓట్ మీల్ మరియు ఒక చెంచా పెరుగు కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సన్ టాన్ తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.
 
3. చర్మం సున్నితంగా, ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండాలంటే కొద్దిగా టమోటో గుజ్జులో లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే వేడి తాపాన్ని తగ్గించి చర్మాన్ని దృఢంగా ఉంచుతుంది.
 
4. సహజ చర్మ సౌందర్యానికి గంధం చాలా బాగా పనిచేస్తుంది. గంధంలో కొంత టమోటో గుజ్జును కలిపి, ముఖానికి రాసుకొని కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగాను, సహజ అందంతో మెరిసిపోతుంది.
 
5. ఈ టమోటోలతో ప్రతి రోజూ స్ర్కబ్బింగ్ చేసుకున్నా సహజ రూపాన్ని సంతరించుకుంటుంది. టమోటో జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, గంధం కలిపి ముఖానికి, మెడకి అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా ఉంటుంది.

అన్నీ చూడండి

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - పలు జిల్లాలకు హెచ్చరిక

గెలిచినా ఓడినా నేర్చుకోవడం ఆపొద్దు : రష్మిక మందన్నా

రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలో ఎన్డీయే

విడాకుల కోసం ఐదేళ్ల పోరాటం చేశారు.. హగ్ చేసుకుని ఐదు నిమిషాల్లో కలిసిపోయారు... (వీడియో)

భారత డీఎన్‌ఏలోనే ఇన్నోవేషన్‌ ఉంది: ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ప్రజలు కుక్కలు అని ఎలా అంటాను? టీవీకె గురించి నేనలా అన్నాననీ: రాఘవ లారెన్స్

కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?

Mohanlal: మోహన్‌లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌

Bhogi: శర్వా.. భోగి చిత్రం కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సంపత్ నంది

V.V. Vinayak: వడ్డే నవీన్‌ సినిమాలు ఇష్టంతో చేయలేదు : వి. వి. వినాయక్

తర్వాతి కథనం
Show comments