శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 19 డిశెంబరు 2020 (22:50 IST)

శీతాకాలంలో ఆలివ్ ఆయిల్ ఎంత మేలు చేస్తుందో తెలుసా?

శీతాకాలం రాగానే కాళ్ల పగుళ్లు, చర్మం పొడిబారిపోవడం, పెదాలు పగుళ్లు, జుట్టు చిట్లిపోవడం వంటి పలు సమస్యలు వెంటాడుతాయి. అలాంటివారు ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
 
పిల్లలకు స్నానం చేయబోయే ముందు ఆలివ్‌ఆయిల్‌ను ఒంటికి పట్టించి, మృదువుగా మర్దనా చేసి, మెత్తని సెనగపిండితో రుద్ది స్నానం చేయిస్తే పిల్లల లేతచర్మం ఎంతోకాంతిగా వుంటుంది. ఎముకలు ధృడపడతాయి, రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
 
శీతాకాలంలో ఆలివ్‌ఆయిల్‌ను ఆరారగా పెదాలకు రాస్తూంటే పెదాలు పగలకుండా మృదువుగానే వుంటాయి. ఆలివ్‌ ఆయిల్‌లో తాజా గులాబీపూల రసాన్ని కలిపి పెదాలకు రాస్తుంటే, పెదాలు పగలవు, మంచిరంగుతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
 
కేశాలు పటిష్టంగా వుండాలంటే ఆలివ్‌ ఆయిల్‌ను వెచ్చచేసి, వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి, పది పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేసినట్లయితే, జుట్టు రాలిపోకుండా వుంటుంది. ఈ ఆయిల్‌లో వెల్లుల్లిపొట్టును కాల్చిన పొడిని కలిపి కానీ లేదా వెల్లుల్లి పొట్టును అలాగే ఆయిల్‌లో కలిపి కాచి కానీ తలకు రాసుకుంటే జుట్టు నల్లబడటమే కాకుండా, త్వరగా జుట్టు నెరవదు.
 
అలాగే పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ఆరారగా రాస్తూంటే ముఖ చర్మం తేమగా ఉంటుంది. కాంతిగానూ, మృదువుగానూ మారుతుంది. ఆలివ్‌ఆయిల్‌లో పసుపుపొడిని కలిపి పాదాల పగుళ్ళకు, వేళ్ళమధ్య పాసిన చర్మానికి రాస్తూంటే ఆ బాధ తగ్గిపోయి, చర్మం చక్కగా ఉంటుంది.