Biodata Maker
✕

పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం.. (video)

Written By మనీల
Updated: గురువారం, 24 అక్టోబరు 2019 (18:10 IST)
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా అందాన్ని పెంచడానికీ ఎంతో ఉపయోగపడుతుంది. పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్టు చేసి అందులో కొంచెం పసుపు కలపండి. ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కున్నాక ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.
 
గుడ్డులోని తెల్లసొనకు కొన్ని పుదీనా ఆకుల పేస్టు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ, మొటిమలూ రాకుండా ఉంటాయి. పుదీనాలో ఉండే శాలిసైలిక్ ఆమ్లం మొటిమలు రాకుండా కాపాడుతుంది.
 
పుదీనా రసానికి, బొప్పాయి రసం కలిపి చర్మ వ్యాధులు వచ్చిన చోట రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా చర్మం ముడతలు పడకుండా, త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చూడటంలో సాయపడుతుంది. చర్మం నునుపు దేలడానికి ఇది పాటించదగిన చిట్కా.
 
పుదీనా ఆకులతో తయారుచేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఇది జుట్టు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. చుండ్రు సమస్య నుంచి బయటపడేస్తుంది. మూడు మీద పొరలు పొరలుగా పొట్టు ఊడకుండా సంరక్షిస్తుంది.
 

అన్నీ చూడండి

వైఎస్ అనిల్ కుమార్తె పెళ్లిలో సతీ సమేతంగా కేటీఆర్, జగన్: సీఎం విజయ్‌తో త్రిష

జపాన్‌కు చెందిన సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ భాగస్వామ్యం

తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. ఆంధ్రప్రదేశ్ వెలుపలికి బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. సుప్రీం

వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది.. అంతే ఆవేశంతో ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి

ఏయ్.. గాజు గ్లాసు ఎందుకు తెచ్చావ్- పోలింగ్ సిబ్బంది: ఐతే ఈ ఫ్యాన్ పీకెయ్- ఓటరు రిప్లై, వీడియో

అన్నీ చూడండి

Sai Durga Tej: అంగరంగ వైభవంగా సాయి దుర్గా తేజ్, కిరణ్ నిశ్చితార్థం

జాన్వీ, రాధికా ఆప్టేలపై రెజీనా ఫైర్.. అసౌకర్యంగా అనిపిస్తే తప్పుకోండి.. అంతేకానీ సినిమా ఇండస్ట్రీలో..?

Kazakhstan; యాక్షన్ సీక్వెన్స్, స్పెషల్ సాంగ్ కోసం కజకిస్థాన్‌ వెళ్ళిన జనవరి 12 విడుదల టీమ్

Rajamouli: రామాయణం ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ నాకు ఎంతగానో నచ్చాయి : రాజమౌళి

Allu Arjun : ముంబై విమానాశ్రయంలో అల్లు అర్జున్ స్టైలిష్‌గా, పవర్‌ప్యాక్డ్ లుక్‌తో మెరిశారు

తర్వాతి కథనం
Show comments