suvichar
✕

కొబ్బరి నూనెలో కరివేపాకులు నానబెట్టి ఇలా చేస్తే..?

Updated: శనివారం, 8 డిశెంబరు 2018 (13:09 IST)
ఈ కాలంలో చాలామందికి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అందుకు ఏం చేసినా కూడా ఎలాంటి లాభాలు కనిపించలేదని బాధపడుతున్నారు. బయట దొరికే పదార్థాలకంటే ఇంట్లోని చిట్కాలు పాటిస్తే కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..
 
1. జుట్టు రాలకుండా ఉండాలంటే.. తడిగా ఉన్నప్పుడు దువ్వితే వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి తడి పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వుకోవాలి. 
 
2. టవల్‌తో వెంట్రుకలను సున్నితంగా తుడిచి ఆరబెట్టాలి. గట్టిగా రుద్దితే వెంట్రుకలు తెగిపోతాయి. దువ్వెలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే దాన్లో ఇరుక్కున్న మట్టి వల్ల వెంట్రుకలు ఊడే సమస్య తలెత్తవచ్చు. 
 
3. తరచు తలకు నూనె రాస్తుండాలి. వారానికోసారి హాట్ ఆయిల్ ట్రీట్‌మెంట్ చేయాలి. ఇందుకోసం కొబ్బరినూనెను వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకల కుదుళ్లను ఆరోగ్యంగా ఉంటాయి.
 
4. కప్పు కొబ్బరినూనెను వేడి చేసుకుని అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసి కాసేపు అలానే ఉంచాలి. ఈ నూనెను తరచు తలకు పట్టిస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. 
 
5. మెంతులు పేస్ట్ చేసి అందులో పావుకప్పు పెరుగు కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి జుట్టుకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది. 

అన్నీ చూడండి

హైదరాబాదులో అండాలను అమ్ముకుంటున్న యువతులు, పోలీసుల అదుపులో 13 మంది

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్‌ పనులు వేగవంతం చేయండి : పవన్ కళ్యాణ్

చమోలీ జిల్లాలో కూలిన హెలికాఫ్టర్ - ఆరుగురి దుర్మరణం (వీడియో)

ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం - నవంబరు ఒకటో తేదీన పోలింగ్

వంగవీటి రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ కలయికపై భయమెందుకు?

అన్నీ చూడండి

కేదార్నాథ్‌లో సారా అలీఖాన్ పూజలు... ఫత్వా జారీచేసిన ముస్లిం మతపెద్దలు

రాజకుమారి శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ లుక్ రిలీజ్

జానపద రిథమ్ ప్లేయర్లతో ఎల్లమ్మ టైటిల్ సాంగ్ చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్

Dulquer: ఆకాశంలో ఒక తార కోసం బాధతో పయనిస్తున్న దుల్కర్ సల్మాన్

NC 51 : చెన్నైలో నవీన్ చంద్ర ‘NC 51 షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments