శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (15:35 IST)

సలాడ్స్ తీసుకుంటున్నారా? తీసుకుంటే ఏంటి?

సలాడ్స్ అంటే పండ్లు, కూరగాయలతో చేసిన పదార్థాలు. చాలామందికి సలాడ్స్ గురించి అంతగా తెలియదు. వీటి గురించి తెలుసుకుంటే.. తప్పక తీసుకోవాలనిపిస్తుంది. అవేంటో చూద్దాం..
 
1. కాయగూరలతో చేసే సలాడ్లలో విటమిన్ ఎ తోపాటూ కెరొటినాయిడ్స్, జియాంతిన్, లెట్యూన్ వంటి పోషకాలు ప్రత్యేకంగా అందుతాయి. ఈ పోషకాలు కంటికి హానిచేసే తీవ్రమైన కాంతి నుండి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. కాయగూరలతో చేసిన సలాడ్ల వలన చిన్న వయసులో కళ్లద్దాల అవసరం ఉండదు.
 
2. నిద్రలేమి సమస్యలున్నవారు రోజూ సలాడ్ తీసుకుంటే హాయిగా, కంటినిండా నిద్రపోవచ్చు. సలాడ్లలో ఎక్కువగా ఉపయోగించే లెట్యూస్ ఆకుల్లో మంచి నిద్రకు అవసరమైయ్యే రసాయనాలు ఎక్కువగా ఉన్నాయి.
 
3. మనం ప్రతిరోజూ తయారుచేసుకునే కూరలు, వేపుళ్లు శరీరంలో చాలావరకు క్యాలరీలు పెంచేవే. అందుకు సలాడ్స్ వంటికి ఎక్కువగా తీసుకోండి. అప్పుడే శరీరంలోని క్యాలరీలు ఖర్చవుతాయి. 
 
4. రోజూ సలాడ్ తినే అలవాటు చేసుకుంటే పీచుకోసం ప్రత్యేకంగా ఆహార పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సలాడ్లు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. అలానే ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు ముందుగా సలాడ్లు తినడం వలన కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా అధిక క్యాలరీలు ఖర్చవుతాయి. 
 
5. భోజనంలో ఏదో ఒక రకం కాయగూర, పప్పు లేదా చారు ఉంటే చాలనుకుంటాం. సలాడ్ తీసుకోవడం వలన ఎక్కువగా రకాల కాయగూరలు మన ఆహారంతో చేరుతాయి. పచ్చికాయగూరలు తీసుకోవడం వలన శరీరంలో ఎంజైములు ఎక్కువగా వచ్చి చేరుతాయి. ఈ ఎంజైములు శరీరం పోషకాలని ఎక్కువగా స్వీకరించేందుకు దోహదపడుతాయి.
 
6. మాంసాహారం, శాకాహారం ఏది తిన్నా కొంచెం ఎక్కువ తినగానే ఏదో బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. సలాడ్స్ తీసుకుంటే ఇలాంటి సమస్యలు దరిచేరవు. శరీరం తేలిగ్గా ఉంటుంది.