శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (16:44 IST)

మందారం పువ్వులతో జుట్టు ఒత్తుగా.. ఎలా?

జుట్టు చివర్లు చిట్లడం, రాలడం, నెరవడం వంటి సమస్యలు మనలో చాలామందికి ఎదురయ్యే సమస్య. ఇలాంటి వాటిని అదుపులో ఉంచాలంటే.. మందార ఆకులు, పువ్వులతో ఇలా చేసి చూడండి..
 
1. గుప్పెడు మందార ఆకులు, నాలుగు పెద్ద చెంచాల పెరుగు తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
 
2. కొన్ని మందార పువ్వులను ముద్దలా నూరుకుని తలకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో ఒకటిరెండుసార్లు చేయడం వలన జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. 
 
3. మూడు చెంచాల ఉసిరికాయ పొడి, 2 స్పూన్ల ఉసిరి రసం గుప్పెడు మందార ఆకుల్ని తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ ముద్దలను తలంతా రాసుకుని 40 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు చిట్లకుండా ఉంటుంది. 
 
4. కప్పు నీటిలో కొన్ని మందార ఆకులు, పువ్వులు వేసి కాసేపు మరిగించుకోవాలి. అది చల్లారాక ఆకుల్ని ముద్దలా చేసి కొద్దిగా సెనగపిండి కలిపితే షాంపూ తయారైనట్లే. ఇలా మిశ్రమాన్ని తలకు పట్టించి స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. 
 
5. కప్పు మందార పువ్వులు, ఆకులను శుభ్రం చేసుకుని ముద్దలా చేసుకోవాలి. కప్పు కొబ్బరి నూనెను వేడిచేసి అందులో ఈ మిశ్రమాన్ని కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత తలకు రాసుకుని మర్నాడు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు పట్టుకుచ్చులా పెరుగుతుంది.