సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 10 నవంబరు 2016 (16:24 IST)

ఇంట్లోనే ఫేస్ ప్యాక్‌లతో మెరిసే సౌందర్యం.. బాదంతో ఫేస్ ప్యాక్‌తో..

బాదంలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ఓట్స్‌, మిల్క్ తో కలిస్తే అద్భుతాలను సృష్టిస్తుంది. ఒక చెంచా బాదం పొడి, ఒక చెంచా ఓట్స్ తీసుకోవాలి. ఈ రెండింటిని పాలల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్

బాదంతో ఫేస్ ప్యాక్.. 
బాదంలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ఓట్స్‌, మిల్క్ తో కలిస్తే అద్భుతాలను సృష్టిస్తుంది. ఒక చెంచా బాదం పొడి, ఒక చెంచా ఓట్స్ తీసుకోవాలి. ఈ రెండింటిని పాలల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది స్కిన్‌టోన్‌ను పూర్తిగా మార్చేస్తుంది. చర్మానికి నిగారింపునిస్తుంది.
 
క్యారెట్‌తో ఫేస్ ప్యాక్
క్యారెట్‌లో విటమిన్‌ 'సి' 'కె' తోపాటు 'బి' కెరోటిన్‌ ఉంటుంది. క్యారెట్‌ తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. పాలపొడి, చక్కెరతో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
 
బొప్పాయితో...
చర్మానికి మెరుపునిచ్చే పండ్లల్లో బొప్పాయి ఒకటి. ఈ బొప్పాయి మాస్క్ తయారు చేసుకోవడానికి.. మూడు ముక్కలు బాగా పండిన బొప్పాయి తీసుకుని... దానికి రెండు చెంచాల బాదం పొడిని కలుపుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్ లాగా వేసుకుని పది నిమిషాల తరువాత ముఖాన్ని మర్దన చేయాలి. తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి.
 
పెరుగుతో
రెండు చెంచాల పెరుగుకు రెండు లేదా మూడు చెంచాల బాదం నూనెను కలపాలి. ఒక చెంచా తేనెను చేర్చాలి. ముఖంపై సమానంగా అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత ముఖానికి మృదువుగా మసాజ్‌ చేసి చల్లని నీటితో కడిగేయాలి. చర్మాన్ని నునుపుగా చేయడమే కాదు... సహజమైన అందాన్నిస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.