Daily Horoscope
✕

మొటిమలు పోవాలంటే.. ఇలా చేయాలి..?

Updated: మంగళవారం, 19 మార్చి 2019 (14:04 IST)
మహిళల సౌందర్యంలో మొదటి స్థానం ముఖానికే. వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగా శరీరంలో ఏర్పడే మార్పుల వలన ముఖంపై మొటిమలు ఏర్పడుతుంటాయి. అయితే రోజంతా ముఖం కడుక్కోవడం వలన మొటిమలు ఏ మాత్రం తగ్గవు. అంతేకాకుండా ఎక్కువసార్లు ముఖాన్ని కడుక్కోవడం ద్వారా చర్మాన్ని నునుపుగా ఉంచేందుకు తోడ్పడే ముఖ్యమైన ఆయిల్స్ పోయి ముఖం డ్రైగా మారుతుంది. అందుకే రోజులో రెండు, మూడు సార్లు ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
 
కొందరు ముఖాన్ని స్కబ్బింగ్ చేయడం వలన ఆయిల్ తగ్గి మొటిమలు తగ్గుతాయని అంటుంటారు. అది కేవలం అపోహ మాత్రం. ఎందుకంటే ముఖాన్ని స్కబ్ చేయడం వలన చర్మం దెబ్బతిని, మొటిమలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సాధారణంగానే వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరగడం వలన మొటిమలు రావడం తగ్గుతుంది.
 
ముఖంపై మొటిమలు ఉన్నవారు చర్మానికి సరిపడే ప్రోడక్ట్‌ను ఎంచుకుని మేకప్ వేసుకోవాలి. అదేవిధంగా మొటిమలు ఎక్కువగా ఉన్నాయని అతిగా మేకప్ వేసుకుంటే పిగ్మెంటేషన్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖానికి వేసుకునే మేకప్ వస్తువులను బ్రాండెడ్ ఉత్పత్తులను ఎంపిక చేసుకుని వాడినప్పటికీ శరీరంలో ఏర్పడే కొన్ని రసాయన చర్యల వలన కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.

అన్నీ చూడండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయం సాధించాం : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ గచ్చిబౌలి : ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

బెంగాల్‌ బాలికపై అత్యాచారం - హత్య : నిందితుడు ఎన్‌కౌంటర్

కూర రుచిగా లేదన్న భర్త.. కత్తితో పొడిచి హత్య చేసిన భార్య

ఢిల్లీ ప్రజలకు ఊపిరాడటం లేదు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

అనిరుధ్ - కావ్య మారన్ వివాహం కోసం గ్రీస్‌కు బయలుదేరిన రజనీ - స్టాలిన్

థియేటర్లలో 'రామాయణ' మూవీ వీడియోలు తీస్తున్నారా.. అయితే జైలుకే

దక్షిణాది చిత్రాల్లో చేదు అనుభవాలున్నాయ్ : రాధికా ఆప్టే

'వెంకటలక్ష్మి రావే’… ప్రేమకు పదాల పట్టాభిషేకం

Anushka Shetty Birth Day: అనుష్క శెట్టి 45వ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు

తర్వాతి కథనం
Show comments