శనివారం, 2 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2016 (09:47 IST)

మామిడి గుజ్జును, పచ్చిపాలలో కలిపి ముఖానికి రాసుకుంటే...?

మామిడి గుజ్జును, పచ్చిపాలలో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం సహజ కాంతిని మెరుగుపరుస్తుంది. ముఖానికి, మెడకు ఈ పేస్టును రాయడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే నిమ్మరసం, పప్పు, పెరుగు, బియ్

మామిడి గుజ్జును, పచ్చిపాలలో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం సహజ కాంతిని మెరుగుపరుస్తుంది. ముఖానికి, మెడకు ఈ పేస్టును రాయడం ద్వారా చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే నిమ్మరసం, పప్పు, పెరుగు, బియ్యంలను కలిపి ముఖానికి వాడండి. దీని వలన మృదువైన, కాంతివంతమైన మరియు మెరుగైన చర్మాన్ని పొందుతారు.
 
ఇక గుడ్డు తెల్ల సొనను తేనెలో కలిపి, ముఖానికి వాడండి. ముఖానికి పూసిన తరువాత 20 నిమిషాల పాటూ అలానే వదిలేయండి. చర్మ కణాల పట్టును మెరుగుపరచి, మెరుగైన చర్మాన్ని అందిస్తుంది. నిమ్మపండు నుండి తాజా నిమ్మరసాన్ని సేకరించి, దీనికి ఒక చెంచా పంచదారను కలపండి. చక్కెర కరిగే వరకు బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మానికి నెమ్మదిగా రాయండి. కాసేపు ఉంచిన తరువాత, గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి.
 
కొన్ని గ్రాముల బ్రెడ్ క్రంబ్స్, ఒక కప్పు మలైని కలిపి మీ ముఖానికి అద్దండి. ఈ ఔషదం, చర్మాన్ని మృదువుగా మార్చటమే కాకుండా, సూర్యకాంతి వలన మారిన చర్మ రంగును కూడా తగ్గించి వేస్తుంది. చర్మానికి సహజ కాంతినిస్తుంది.