1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2016 (10:37 IST)

సాల్మన్ చేపలు మూడుసార్లు ఆరగిస్తే ముఖంపై ముడతలు మటుమాయం

సాధారణంగా అనేక మంది యువతులు, మహిళల ముఖాలపై ముడతలు ఉంటాయి. దీంతో వారు తీవ్ర నిరుత్సాహానికి లోనవుతుంటారు. యవ్వన వయస్సులోనే వృద్ధాప్యం వచ్చినంతగా వారు బాధపడిపోతుంటారు. వయస్సు పెరిగే కొద్దీ ముడతలు రావడం శారీరక మార్పులో ఓ భాగం. అయితే, చిన్న వయస్సులో రావడం అనేదే వారు జీర్ణించుకోలేక పోతారు. 
 
ఇలాంటివారు సముద్రంలో లభించే సాల్మన్ చేపలను మూడు ఆరగిస్తే ఈ ముడతలకు చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే వీటిలో మోతాదుకు మించిన సంఖ్యలో ప్రొటీన్స్ ఉంటాయట. అందుకే ఈ చేపలను వారంలో మూడు సార్లు ఆరగిస్తే ముఖంలో ముడతలకు కొంత మేరకు చెక్ పెట్టొచ్చని చెపుతున్నారు. 
 
అలాగే, వేసవి కాలంలో లభించే పుచ్చకాయలను ఇష్టానుసారంగా ఆరిగించడం వల్ల కూడా వీటిని తగ్గించుకోవచ్చని చెపుతున్నారు. ఈ కాయలో ఏ, బి, సి, ఈ, విటమిన్లు, కొవ్వు పదార్థాలు, జింక్‌లు ఉంటాయని చెపుతున్నారు. ఇవి ముఖంలో ఉండే ముడతలను మాయం చేసి.. అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తాయని బ్యూటీషన్లు చెపుతున్నారు.