Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్సవ్ డిపాజిట్: ఎస్బీఐ నుంచి కొత్త డిపాజిట్ పథకం..

Written By సెల్వి
Updated: మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:39 IST)
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ని సెలబ్రేట్ చేస్తూ 'ఉత్సవ్ డిపాజిట్' (Utsav Deposit) పేరుతో సరికొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది ఎస్బీఐ. ఈ స్కీమ్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 
 
స్కీమ్ ప్రారంభం అయినప్పటి నుంచి 75 రోజుల వరకు ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేసినవారికి ప్రత్యేక వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఆ తర్వాత ఈ స్కీమ్ అందుబాటులో ఉండదు. 
 
మళ్లీ పాత వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయి. ఎస్‌బీఐలో సాధారణంగా ఉండే వడ్డీ రేట్ల కన్నా ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకున్నవారికి ఎక్కువ వడ్డీ లభించనుంది.  
 
ఎస్‌బీఐ ఉత్సవ్ డిపాజిట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు దాచుకోవడానికి 2022 అక్టోబర్ 28 వరకే అవకాశం ఉంది. 'ఉత్సవ్ డిపాజిట్' స్కీమ్‌లో డబ్బులు దాచుకునేవారికి 6.10 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ టెన్యూర్ 1000 రోజులు. అంటే మూడేళ్ల లోపే. 
 
బ్యాంకులో మూడేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. మరోవైపు ఎస్‌బీఐ రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 15 నుంచి అమలులోకి వచ్చాయి.

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం
Show comments