అమేజాన్ కొత్త ఆఫర్.. అమేజాన్ పే లేటర్ వచ్చేసింది..

Written By సెల్వి
Updated: శనివారం, 2 మే 2020 (12:40 IST)
అమేజాన్ కొత్త ఆఫర్ ప్రకటించింది. కరోనా కారణంగా ఆన్‌లైన్ కొనుగోళ్ళు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో అమేజాన్ కూడా అమేజాన్ పే లెటర్ పేరుతో కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 
 
అమేజాన్ పే లేటర్ పేరిట వున్న సదుపాయానికి ముందుగా డిజిటల్ పద్ధతిలో సైనప్ కావాలి. అక్కడ అడిగిని వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత రుణం వెంటనే మంజూరవుతుంది. అయితే... మనం కొనుగోలు చేసిన సరుకు తాలూకు డబ్బును అమేజాన్ ముందుగానే సంబంధిత సంస్థకు చెల్లిస్తుంది. ఆ తర్వాత కొనుగోలుదారులు... అమేజాన్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
 
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారుల కోసం త్వరలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ -భారత్ మార్కెట్ డాట్ ఇన్‌ను ప్రారంభించనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) శుక్రవారం ప్రకటించింది. స్థానిక చిల్లర వ్యాపారుల కోసమే ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు సీఐఐటి తెలిపింది. 
 
ఇందులో భాగంగా చిన్న దుకాణాలు, చిల్లర వ్యాపారులు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి వీలు కల్పించే ఉద్దేశంతో అమేజాన్ కూడా కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో తన కొత్త ప్రోగ్రామ్ 'అమెజాన్ లోకల్ షాప్స్'ను ప్రకటించింది.

అన్నీ చూడండి

భగవంత్ కేసరి చిత్రం నుంచి ప్రేరణ పొందాం.. నిర్మాత వెంకట్

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments