శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 మే 2020 (18:54 IST)

మే 17 వరకూ లాక్ డౌన్, కేసులు జీరో వచ్చే వరకూ తాళాలేనా?

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ 35 వేల మందికి పైగా కరోనా వైరస్ వ్యాధి సోకింది. ఈ నేపధ్యంలో ముందుగా ప్రకటించినట్లు మే 3న లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి చేజారిపోయే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావించింది. 
 
ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ సాగుతూనే వున్నది కానీ అదుపులోకి రాలేదు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4 నుంచి మరో రెండు వారాల పాటు.. అంటే మే 17 వరకూ ఈ లాక్‌డౌన్‌ కొనసాగనుంది.