బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 22 మార్చి 2024 (22:30 IST)

టీ20 కప్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అధికారిక ఐస్‌క్రీమ్ భాగస్వామిగా అరుణ్ ఐస్‌క్రీమ్స్

Arun icecream
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ అరుణ్ ఐస్‌క్రీమ్స్, టి20 కప్ 2024 సీజన్‌కు అధికారిక ఐస్‌క్రీం పార్టనర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన భాగస్వామ్యాన్ని ఎంతో ఉత్సాహంగా ప్రకటించింది. ఈ భాగస్వామ్యం అరుణ్ ఐస్‌క్రీమ్స్‌‌కు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్‌లలో తమ ఉనికిని బలోపేతం చేయడానికి సంస్థ ప్రయత్నిస్తోంది.
 
అరుణ్ ఐస్‌క్రీమ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య భాగస్వామ్యం శ్రేష్ఠత- వైవిధ్యాన్ని కోరుకొనే భాగస్వామ్య దృక్పథానికి ఉదాహరణగా నిలుస్తుంది. అత్యంత సమర్థుడైన పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ డైనమిక్ టీమ్ మాదిరిగానే, అరుణ్ ఐస్‌క్రీమ్స్ కూడా విభిన్న అభిరుచులకు, ప్రాధాన్యతలకు అనుగుణంగా విస్తృత శ్రేణి రుచులను, ప్రత్యేకతలను అందిస్తోంది.
 
"అత్యుత్తమ ప్రదర్శనకు, అంకితభావానికి పేరుపొందిన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అనుబంధం కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం. క్రికెట్ ఔత్సాహికులతో సన్నిహితంగా ఉండడమే కాకుండా, ఈ ప్రాంతంలోని వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే మా నిబద్ధతను ఈ భాగస్వామ్యం బలపరుస్తుంది" అని అరుణ్ ఐస్ క్రీమ్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
 
ఈ భాగస్వామ్యంలో భాగంగా, టి20 కప్ 2024 సీజన్ అంతటా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల లీడ్ హెల్మెట్లు, క్యాప్‌ మీద అరుణ్ ఐస్‌క్రీమ్స్ లోగోను ప్రముఖంగా ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విధమైన దృశ్యం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులలో బ్రాండ్ తాలూకు పరిధిని, గుర్తింపును మరింత పెంచుతుంది.
 
"అరుణ్ ఐస్‌క్రీమ్స్‌ను మా అధికారిక ఐస్‌క్రీమ్ భాగస్వామిగా స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం" అని సన్‌రైజర్స్ హైదరాబాద్ సిఇఓ  శ్రీ షణ్ముగం తెలిపారు. "శ్రేష్టత మరియు నవ్యావిష్కరణల పట్ల వారి నిబద్ధత మా జట్టు తాలూకు తత్వానికి అనుగుణంగా ఉంటుంది, మైదానంలో, బయట  విజయవంతమైన భాగస్వామ్యం కోసం మేము ఎదురుచూస్తున్నాం” అని చెప్పారు. ఈ వ్యూహాత్మకమైన మైత్రి ద్వారా, వినియోగదారులతో అనుసంధానం కావడానికి, ఆంధ్రప్రదేశ్-తెలంగాణల్లో తన మార్కెట్ ఉనికిని విస్తరించుకోవడానికి ఐపిఎల్ క్రికెట్ ప్రజాదరణను మరియు ఉత్సాహాన్నీ సానుకూలంగా ఉపయోగించుకోవాలనేది అరుణ్ ఐస్‌క్రీమ్స్ లక్ష్యం.