శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (12:15 IST)

రూ.2 వేల నోటును రద్దు చేయం : విత్తమంత్రి జైట్లీ

దేశంలో మరోమారు పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేయబోతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, రూ.1000 నోటు స్థానంలో భారత రిజర్వు బ్యాంకు రూ.2000 నోటును ప

దేశంలో మరోమారు పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు రద్దు చేయబోతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, రూ.1000 నోటు స్థానంలో భారత రిజర్వు బ్యాంకు రూ.2000 నోటును ప్రవేశపెట్టింది.
 
ప్రస్తుతం ఈ నోటు ముద్రణను ఆర్బీఐ పూర్తిగా నిలిపివేసిందనీ, అందువల్ల ఈ నోటును రద్దు చేయవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఓ నివేదికలో పేర్కొంది. దీంతో రూ.2 వేల నోటు రద్దు ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారంతో దేశ వ్యాప్తంగా మరోమారు అలజడి చెలరేగింది.
 
దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఈ వార్తలన్నీ అవాస్తవాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనలు వెలువడితే తప్ప ఇలాంటి విషయాలను నమ్మరాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏ ఒక్కరూ నమ్మరాదనీ ఆయన కోరారు.