ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (13:45 IST)

ఇండిగో విమానంలో పండంటి పాపకు జన్మనిచ్చిన మహిళ..!

Indigo
కర్ణాటకలోని బెంగళూరు నుంచి రాజస్థాన్‌లోని జైపూర్ వెళ్లిన ఇండిగో విమానంలో బుధవారం ప్రయాణించిన ఓ గర్భిణి విమానంలోనే పాపకు జన్మనిచ్చారు. విమానంలో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్, విమాన సిబ్బంది సహాయంతో కాన్పు చేశారు.
 
జైపూర్ విమానాశ్రయానికి సమాచారం అందించడంతో విమానం అక్కడికి చేరేసరికి తల్లీబిడ్డలకు పూర్తి వైద్య సహాయం అందించేందుకు వీలుగా అంబులెన్స్, డాక్టర్‌ని సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో విమానయాన సంస్థను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. అలాగే విమానంలో జన్మించిన తల్లీబిడ్డకు ఎయిర్ పోర్ట్ చేరగానే ఇండిగో సిబ్బంది స్వాగతం పలికారు.
 
కాగా... గత ఏడాది అక్టోబర్‌లో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఒక మహిళా ప్రయాణీకురాలు విమానంలో పండంటి పసికందుకు జన్మనిచ్చింది.