1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 9 నవంబరు 2016 (20:45 IST)

బ్యాంకులపై కేంద్రం కీలక నిర్ణయం... శని, ఆదివారాలు బ్యాంకులు పనిచేస్తాయి...

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే శనివారం, ఆదివారం కూడా దేశంలోని అన్నీ బ్యాంకులు పనిచేస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. పెద్ద నోట్లను రద్దు చేయడం, ఆ వెంటనే బుధవారం బ్యాంకులు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే శనివారం, ఆదివారం కూడా దేశంలోని అన్నీ బ్యాంకులు పనిచేస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. పెద్ద నోట్లను రద్దు చేయడం, ఆ వెంటనే బుధవారం బ్యాంకులు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు నేపధ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. పెద్ద నోట్లు చెలామణి కాకపోవడంతో చాలాచోట్ల టోల్‌గేట్ల వద్ద వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులను దూరం చేయడానికి టోల్‌ట్యాక్స్‌లను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
 
పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో బుధవారం బ్యాంకులు వినియోగదారుల సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈరోజు, రేపు ఏటీఎంలు పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో కరెన్సీ మార్పిడి కోసం జనాలు గురువారం పెద్దఎత్తున బ్యాంకులకు పోటెత్తే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సెలవు దినాలైన వచ్చే శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయించాలని నిర్ణయించినట్టు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎఫైర్స్‌ తెలిపింది.