శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (11:18 IST)

ట్విట్టర్‌ ట్రెండింగ్‌- భారత్ మ్యాట్రిమోనీని బాయ్‌కాట్ చేయండి..

marriage
మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ భారత్ మ్యాట్రిమోనీ హోలీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన తాజా వీడియో ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. హోలీని నెగిటివ్‌గా చిత్రీకరించడం ద్వారా హిందూ మనోభావాలను దెబ్బతీసేలా వెబ్‌సైట్ ఉందని నెటిజన్లు ఆరోపించారు.
 
ఈ వివాదం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు వెబ్‌సైట్ భావప్రకటనా స్వేచ్ఛను సమర్థించారు. మరికొందరు ప్రకటన హిందూ సంప్రదాయాల పట్ల అనుచితంగా ఉందని విమర్శించారు. 
 
ట్విట్టర్‌లో #BoycottBharatMatrimony ట్రెండింగ్‌లో ఉన్న కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు వెబ్‌సైట్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రకటనను తీసివేయాలని డిమాండ్ చేశారు.