శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 మార్చి 2023 (13:09 IST)

కొన్ని గంటల పాటు ఆగిపోయిన ట్విట్టర్ పిట్ట

twitter
కొన్ని గంటల పాటు ట్విట్టర్ కూత ఆగిపోయింది. ట్విట్టర్ డౌన్ అయ్యింది. మెక్రోబ్లాగింగ్ ఫ్లాట్‌ఫారమ్‌ అయిన ట్విట్టర్‌లో ట్వీట్లు లోడ్ కావట్లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ మేరకు ట్వీట్లు డౌన్ లోడ్ కాలేదని స్క్రీన్ షాట్లతో ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో పోస్టులు పెడుతున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ డౌన్ అయింది. 
 
వేలాది మంది వినియోగదారులు ట్విట్టర్ సేవలను యాక్సెస్ చేయలేకపోతున్నారు. ఇదే అంశంపై అటు పలువురు యూజర్లు  ట్విట్టర్‌లో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో #TwitterDown పేరిట ఓ హ్యాష్ టాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ఎలాన్ మస్క్ సీఈవో అయిన తర్వాత ట్విట్టర్ ఇలాంటి సమస్యలను పలుమార్లు ఎదుర్కొందని చెబుతున్నారు.