శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 మార్చి 2023 (12:32 IST)

రన్నింగ్ కారులో మంటలు.. వెంటనే అందరూ దిగిపోయారు..

రన్నింగ్ కారులో మంటలు చెలరేగిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన నవీన్ అనే వ్యక్తి కుటుంబంతో సహా కారులో మహబూబ్ నగర్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో షాద్ నగర్ సోలిపూర్ శివారు ప్రాంతానికి రాగానే.. కారులో మంటలు చెలరేగాయి. 
 
మంటల్ని గమనించిన నవీన్.. ఒక్కసారిగా బ్రేక్ వేసి కారును పక్కకు ఆపేశాడు. అనంతరం తన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి అందరిని కారు నుంచి కిందకు దించేశాడు. క్షణాల వ్యవధిలోనే కారు మెుత్తం మంటలు వ్యాపించి కాలి బూడిదైంది. 
 
నవీన్ అప్రమత్తంగా కారును ఆపేయడం వెంటనే కుటుంబ సభ్యులను కారును దించేయడం జరగకపోతే పెను ప్రమాదం సంభవించేది. దీంతో ఈ ప్రమాదం నుంచి వారు క్షేమంగా బయటపడ్డారు.