గురువారం, 30 నవంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (11:43 IST)

రంజీ ట్రోఫీ.. హనుమ విహారీ అదుర్స్.. మణికట్టు ఫ్రాక్చర్ అయినా... (video)

Hanuma Vihari
రంజీ ట్రోఫీలో భాగంగ ఇండోర్ మధ్యప్రదేశ్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఏపీ కెప్టెన్ హనుమ విహారీ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు అసమాన పోరాట పటిమ కనబరిచి అందరి ప్రశంసలు అందుకున్నాడు. 
 
మధ్యప్రదేశ్ పేసర్ అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో విహారి ఎడమ చేయి మణికట్టుకు గాయమైంది. దీంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత చివరిలో మళ్లీ బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.అప్పటికే అతడి ఎడమ చేయికి ఫ్రాక్చర్ అయినట్లు ఎక్స్‌రే రిపోర్ట్‌లో తేలింది. 
 
అయినప్పటికీ లెక్క చేయకుండా క్రీజులోకి వచ్చాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయి విహారీ.. ఎడమ చేయికి బంతి తగలకుండా ఉండేందుకు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 
 
మణికట్టు ఫ్రాక్చర్ అయినా.. జట్టుకు పరుగులు అవసరం అని భావించిన విహారి.. పృథ్వీరాజ్ యర్రా (2) తొమ్మిదో వికెట్‌గా అవుటైన తర్వాత బ్యాట్ పట్టాడు.  గాయమైన ఎడమచేతిని రక్షించుకునేందుకు ఈసారి ఎడమ చేత్తో బ్యాటింగ్ చేశాడు.