శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (17:07 IST)

పృద్వీ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా కొత్త రంగుల ప్రపంచం

Pridvi Raj,   Kranti Krishna, Srilu and ohters
Pridvi Raj, Kranti Krishna, Srilu and ohters
ఇప్పటివరకు ప్రేక్షకులను తనదైన కామెడీతో మేనరిజంతో ఆకట్టుకున్న సీనియర్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా "కొత్త రంగుల ప్రపంచం" . పృద్విరాజ్, క్రాంతి కృష్ణ, శ్రీలు, విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, కృష్ణ తేజ, అంబటి శ్రీను, జబర్దస్త్ నవీన్, జబర్దస్త్ గణపతి నటీనటులుగా శ్రీ పిఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డిలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. 
 
ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా  పృద్వి మాట్లాడుతూ, ఈ సినిమా చాలాబాగా వచ్చింది. ఒక సీన్ ను మొదలుపెట్టేముందు డీఓపీ తో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. ఈ సినిమాకి సినీ ప్రముఖులు నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. మరిన్ని వివరాలు త్యరలో తెలుపుతాము అన్నారు.