ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 మార్చి 2023 (22:33 IST)

ఈ వేసవిలో మీ వన్-స్టాప్ ట్రావెల్ డెస్టినేషన్ క్లియర్‌ట్రిప్

clear trip
రాబోయే వేసవి సెలవులకు ముందు, ఫ్లిప్‌కార్ట్ కంపెనీ అయిన క్లియర్‌ట్రిప్, ఎక్కువ ప్రయాణ కనెక్టివిటీకి వీలు క్పలించేందుకు తన యాప్‌లో బస్సు సేవలను ప్రారంభించనున్నట్లు ప్రక టించింది. ప్రస్తుతం, ఇది 10L బస్సు కనెక్షన్ల జాబితాను కలిగి ఉంది. భారతదేశంలో అతిపెద్ద బస్సు నెట్‌వర్క్‌‌ను నిర్మించాలని సంస్థ యోచిస్తోంది. సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది.
 
ఈ కొత్త బస్సు బుకింగ్ వ్యాపారం సాటిలేని సరళత, పారదర్శకత ద్వారా క్లిష్టమైన వినియోగదారు అవస రాలను పరిష్కరిస్తుంది. 24X7 వాయిస్ హెల్ప్‌ లైన్ అందుబాటులో ఉంటుంది. దాగి ఉండే ఖర్చులు ఉండవు, త్వరితగతిన రీఫండ్‌లు, సులభంగా రద్దు చేయడం వంటి కొన్ని ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. లాంఛ్ ఆఫర్‌లో భాగంగా, వినియోగదారులు 31 మార్చి 2023 వరకు అన్ని బస్సు బుకింగ్‌లపై ‘జీరో కన్వీనియన్స్ ఫీజు’, 10% ఏకమొత్తం తగ్గింపు వంటి ప్రయోజనాలను పొందవచ్చు.
 
బోనస్‌గా, కంపెనీ భారతదేశపు అతిపెద్ద వేసవి ట్రావెల్ సేల్‌ #NationOnVacationను కూడా ఆవిష్కరించింది. హోటళ్లు, విమానాలు, బస్సులపై పరిశ్రమలోనే మొదటిసారి అని చెప్పదగ్గ ఆఫర్‌లతో ఇది నిండిపోయింది. క్లి యర్‌ట్రిప్  మార్క్యూ ఐపీ వార్షిక కార్యక్రమంగా ఈ మొదటి ఎడిషన్, మునుపెన్నడూ లేని విధంగా ప్ర యాణాన్ని సరసమైందిగా చేసేందుకు హామీ ఇచ్చింది. ఈ ఉత్తేజకరమైన అభివృద్ధి గురించి క్లియర్‌ట్రిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రహ్లాద్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, “క్లియ ర్‌ట్రిప్‌లో మేం తీసుకునే ప్రతి నిర్ణయం మా వినియోగదారులకు ఎంపిక, స్పష్టత, నియంత్రణతో సాధికారత కల్పించడంగా ఉం టుంది. బస్సు సేవల ప్రారంభం కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ కొత్త ప్రయత్నం విశ్వసనీయ, సమగ్ర ప్రయా ణ భాగస్వామిగా మా స్థానాన్ని బలోపేతం చేయడానికి, మా కస్టమర్ ఎంగేజ్‌ మెంట్‌ను మరింతగా పెంచడానికి, ప్రయా ణాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుంది’’ అని అన్నా రు.
 
#NationOnVacation గురించి మరింతగా వివరిస్తూ ‘‘వివిధ వయస్సు సమూహాలు, భౌగోళిక ప్రాంతాలలో వేసవి సెలవులు ప్రత్యేక ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి. #NationOnVacation ప్రారంభంతో, వేసవిని, ప్రయాణాలను భారతదేశం మరింతగా ప్రేమించాలని మేం కోరుకుంటున్నాం. ఈ డీల్‌లతో, ప్రయాణికులు చివరి నిమిషం ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు, ఉత్తమ ధరల ప్రయోజనాన్ని పొందవచ్చు, అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు’’ అని అన్నారు.
 
22 మార్చి 2023 నుండి, #NationOnVacation అనేది రూ. 999 మరియు రూ. 4999తో ప్రారంభమయ్యే దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణ రేట్లతో కూడిన 9 రోజుల ప్రయాణ మహోత్సవం. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల కోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ ఆఫర్లు ఇందులో ఉంటాయి.