ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (20:19 IST)

కాంతారా 2... రిషబ్ శెట్టి అలా చేస్తున్నారట...

Kanthara
కాంతారా మూవీ ఏ మేరకు సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ కాంతారా మూవీకి ప్రస్తుతం సీక్వెల్ రాబోతోంది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కాంతారా 2 స్టోరీపై దర్శకుడు రిషబ్ శెట్టి తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడని టాక్ వస్తోంది. 
 
ఈ చిత్రాన్ని వీలైనంత వరకు సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2024 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం పరిశోధన చేసేందుకు రెండు నెలల పాటు తన రైటింగ్ అసోసియేట్‌లతో రిషబ్ కోస్టల్ కర్ణాటక అడవులకు వెళ్లినట్లు తెలుస్తోంది.
 
ఇప్పుడు కాంతార 2 లో శివ తండ్రి దగ్గర సినిమా కథ ప్రారంభించే అవకాశం ఉంది. అక్కడ నుంచి.. భూములు ఎలా వచ్చాయి.. ఆ తర్వాత జరిగిన అంశాల చుట్టూ.. కథను అల్లుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.