Biodata Maker

దేశంలో మోతమోగిస్తున్న జీఎస్టీ వసూళ్లు

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 2 జనవరి 2024 (11:37 IST)
దేశంలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. డిసెంబరు నెలలో వసూలైన జీఎస్టీ వసూళ్లను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. డిసెంబరు నెలలో మొత్తం రూ.1.65 లక్షల కోట్లు వసూలైనట్టు పేర్కొంది. నవంబరు నెలలో పోల్చితే డిసెంబరు నెలలో రెండు శాతం అధికంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని తెలిపింది. 
 
నవంబరు నెలలో కూడా రూ.1.68 లక్షల కోట్ల మేరకు జీఎస్టీ పన్నులు వసూలైన విషయం తెల్సిందే. అయితే, గత 2022 డిసెంబరుతో పోల్చితే 2023 డిసెంబరు నెలలో జీఎస్టీ వసూళ్లలో పది శాతం వృద్ధి నమోదైంది. ఏదేమైనా వరుసగా పదో నెల కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్ల మార్కును దాటడం గమనార్హం. 
 
డిసెంబరు నెల వసూళ్ల వివరాలను పరిశీలిస్తే, సెంట్రల్ జీఎస్టీ రూ.30,443 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ వసూళ్లు రూ.37,935 కోట్లు. సమీకృత జీఎస్టీ వసూళ్లు రూ.84,255 కోట్లు, ఇందులో దిగుమతులపై వసూలైన మొత్తం రూ.41,534 కోట్లుగా ఉంది. ఇక సెస్ రూపంలో రూ.12249 కోట్లుగా ఇందులో దిగుమతులపై వసూలైన పన్ను రూ.1079 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

అన్నీ చూడండి

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

Rashmika Mandanna : ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రశ్మిక మందన్న- అల్లు అరవింద్ ప్రకటన

Ramyakrishna :ఒక్క చూపు... ఆ ఫ్రేమ్ అంతా ఆమెదే.. అంటూ మంచు మనోజ్ ప్రశంస

Samantha Ruth Prabhu: శ్రీచక్ర యంత్రంతో సమంత సీమంతం Photos

Dr. Rajendra Prasad: అందరి కథ. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులూ కన్నీరు పెట్టుకున్నారు : డా. రాజేంద్రప్రసాద్

తర్వాతి కథనం
Show comments