శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (08:46 IST)

కిందికి దిగివచ్చిన వంట నూనెల ధరలు

Oils
గత కొన్ని రోజులుగా వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ పెరిగిన ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. అయితే, ఈ ధరల తగ్గుదలకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఫలితంగా ఈ ధరలు తగ్గాయి. ఇది సామాన్య ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే అంశం. 
 
అంతర్జాతీయ మార్కెట్‌ విఫణిలో నూనె ధరలు తగ్గడంతో దేశీయంగానూ తగ్గుముఖం పట్టాయి. పామాయిల్ ధర లీటరుకు 7 నుంచి 8 రూపాయల వరకు తగ్గింది. అలాగే సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రూ.10 నుంచి రూ.15 మేరకు తగ్గింది. సోయాబీన్ ధర రూ.5 తగ్గిందని భారతీయ వంటనూనెల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ రావు దేశాయ్ వెల్లడించారు. 
 
ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర మాత్రం కిందటివారంలోనే రూ.15 నుంచి రూ.20 మేరకు తగ్గిందని, ఈ వారం మరో రూ.20 మేరకు తగ్గనుందని హైదరాబాద్ నగరానికి చెందిన జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ తెలిపింది.