ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:27 IST)

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గనున్నాయట..?!

రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు దిగి రానున్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇప్పుడు వీటి ధరలు తగ్గుతున్నాయని, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశముందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల తగ్గుదల బెనిఫిట్‌ను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని వివరించారు. 
 
ఇకపోతే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఏప్రిల్ నెలలో రూ.10 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్ల తగ్గుదల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే గ్యాస్ సిలిండర్ ధర దిగివచ్చింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.809 వద్ద ఉంది. 
 
అదే మన ఊరిలో అయితే ఎల్‌పీజీ సిలిండర్ కొనుగోలు చేయాలంటే రూ.900 చెల్లించుకోవాల్సిందే. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.125 మేర పైకి కదిలింది. పెరగడం భారీగా పెరిగింది కానీ.. తగ్గడం మాత్రం కేవలం రూ.10 మాత్రమే కావడం గమనార్హం.