బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (13:37 IST)

ఐఓసీఎల్ నుంచి గుడ్ న్యూస్.. 5 కేజీల చిన్న గ్యాస్ సిలిండర్ ఫ్రీ

Cylinder
దేశీ దిగ్గజ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) అదిరిపోయే శుభవార్త. ఇండేన్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. అదిరిపోయే స్కీమ్ గురించి వెల్లడించింది. దీని వల్ల సింగిల్ సిలిండర్ ఉపయోగించే వారికి ఊరట కలుగనుంది. ఇండేన్ గ్యాస్ కంపెనీ కాంబో డబుల్ బాటిల్ కనెక్షన్ అనే స్కీమ్ అందిస్తోంది.
 
ఈ స్కీమ్ కింద ఇండేన్ వినియోగదారులు 14.2 కేజీల సిలిండర్‌తోపాటు 5 కేజీల చిన్న గ్యాస్ సిలిండర్ కూడా పొందొచ్చు. ఈ ఫెసిలిటీ వల్ల గ్యాస్ సిలిండర్ అయిపోతే ఇబ్బంది పడాల్సిన పని లేదు. 14.2 కేజీల సిలిండర్ మార్చేసి 5 కేజీల సిలిండర్ ఉపయోగించుకోవచ్చు. 
 
అయితే ఈ డబుల్ కనెక్షన్‌కు సంబంధించిన వివరాల కోసం మీరు మీ డిస్ట్రిబ్యూటర్ సంప్రదించాలని ఇండేన్ గ్యాస్ తెలిపింది. ఇండియన్ ఆయిల్ ట్విట్టర్ వేదికగా ఈ డబుల్ బాటిల్ కనెక్షన్ గురించి వెల్లడించింది.