బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2024 (13:26 IST)

దీపావళి: పసిడి ధరలు పైపైకి.. వెండి ధరలు కూడా అప్

Gold Jewelry
దీపావళికి ముందు బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడికి డిమాండ్ పెరుగుతుండడంతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగిపోయాయి. బంగారంతో పాటు పెరిగే వెండి ధర భారీగానే పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో కిలో వెండిపై వెయ్యి రూపాయలు పెరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. పసిడి ధర రికార్డు స్థాయిలో ఏకంగా రూ.80 వేలకు చేరువైంది. స్వచ్ఛమైన బంగారం ధర ఢిల్లీలో శుక్రవారం రూ. 79,900గా నమోదైంది. గురువారంతో పోలిస్తే పది గ్రాముల పసిడిపై రూ. 550 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వర్ణం ధరపై రూ. 870 పెరిగి రూ. 78,980కు చేరుకుంది. 
 
ఇకపోతే.. కిలో వెండిపై వెయ్యి రూపాయలు పెరిగి రూ. 94,500కు చేరుకుంది. హైదరాబాద్‌లో కిలో వెండిపై ఏకంగా రూ. 2 వేలు పెరిగి రూ. 1,05,000కు ఎగబాకింది.