గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (10:20 IST)

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు...

బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారంపై రూ. 330 పెరగడంతో ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,330గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,330 గా ఉంది. బంగారంతో పాటు వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. అయితే రెండు రోజుల నుంచి తగ్గిన వెండి ధరలు.. తాజాగా పెరిగాయి.
 
గురువారం దేశంలో కిలో వెండి ధర రూ.63,400లుగా ఉంది. కాగా.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాదిన 200మేర ధర పెరిగితే.. దక్షిణాదిన కిలో వెండి ధరపై రూ.300మేర పెరిగింది.
 
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,330గా ఉంది.