మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 డిశెంబరు 2018 (13:25 IST)

కొత్త సంవత్సరంలో కేబుల్ ఆపరేటర్ల షాక్ : మూగబోనున్న బుల్లితెరలు

కొత్త సంవత్సరంలో కేబుల్ ఆపరేటర్లు దేశ ప్రజలకు షాక్ ఇవ్వనున్నారు. ఫలితంగా బుల్లితెరలు మూగబోనున్నాయి. టీవీ ఛానెళ్ల ఛార్జీల పెరుగుదల కారణంగా కేబుల్ ఆపరేటర్లు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29వ తేదీన ఒక రోజు కేబుల్ టీవీ ప్రసారాలను నిలిపివేయాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కేబుల్ టీవీ ఆపరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇటీవలే ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. జనవరి ఒటో తేదీ నుంచి ట్రాయ్ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ట్రాయ్ నిబంధనలకు సుప్రీంకోర్టు కూడా ఆమోదముద్ర వేసింది. అంటే జనవరి 1వ తేదీ నుంచి కోరిన ఛానెళ్లు మాత్రమే చూసే అవకాశం ఉంది. కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై ప్రజల్లో అవగాహన లేదు.
 
ప్రస్తుతం రూ.150 నుండి రూ.250 వరకు ఇప్పటివరకు జనాలు కేబుల్ ఆపరేటర్లకు చెల్లిస్తున్నారు. నిబందనలు అమల్లోకి వస్తే.. పే ఛానళ్లు చూడాలంటే ప్యాకేజీలో ఉండే ఒక్కో ఛానల్‌కు రూ.19 చెల్లించాల్సి వస్తుంది. సో.. ఈ పద్ధతిలో చూసుకుంటే.. కనీసం రూ.600 వరకు చెల్లించాల్సి వస్తుందని ఎంఎస్ఓలు చెబుతున్నారు. తెలుగు ఛానళ్లు, సీరియళ్లు చూడాలంటే ప్యాకేజీలకు అనుగుణంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. హెచ్‌డి ఛానళ్లకు ధర ఇంకొంచం ఎక్కువ ఉంటుందని ఆపరేటర్లు చెబుతున్నారు.