శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 డిశెంబరు 2017 (19:17 IST)

ఆ విమానాల్లో పిచ్చపిచ్చగా ప్రయాణించేయవచ్చు... ఎలా?

విమాన ప్రయాణం కూడా తక్కువ ధరకే చేసేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి కొన్ని విమాన సర్వీసులు. తాజాగా ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అత్యంత తక్కువ ధరకే ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఆ ధరలు చూస్తుంట

విమాన ప్రయాణం కూడా తక్కువ ధరకే చేసేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి కొన్ని విమాన సర్వీసులు. తాజాగా ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అత్యంత తక్కువ ధరకే ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఆ ధరలు చూస్తుంటే ఏసీ ఫస్ట్ క్లాసు రైలు ప్రయాణ చార్జీకి అటుఇటుగా వుంటోంది. కాబట్టి ఇక ఎంచక్కా విమానం ఎక్కేయవచ్చు. ఇంతకీ ఇండిగో ప్రకటించిన రూట్లు.. ధరలు చూద్దాం.
 
టికెట్‌ ప్రారంభ ధర - రూ.1,112.
జమ్ము-శ్రీనగర్‌ టికెట్‌ ధర - రూ.1,112
కోయంబత్తూరు- చెన్నై ప్రారంభం ధర- రూ.1,195
విశాఖపట్టణం-హైదరాబాద్‌ రూ.1,259
పట్నా-కోల్‌కతా రూ.1,264
బెంగళూరు-చెన్నై రూ.1,285
 
ఐతే జనవరి రెండో వారంలో ప్రయాణానికి ఈ ధరలు అందుబాటులో ఉంటాయని తెలియజేసింది. నూతన సంవత్సరం, పండుగల దృష్ట్యా ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలియజేసింది.