శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (16:40 IST)

ఎస్ఆర్ఎం యూనివర్శిటీ తమిళ అకాడెమీ అవార్డుల వెల్లడి

దేశంలో వున్న అగ్రగామి డీమ్డ్ వర్శిటీల్లో ఒకటి చెన్నైలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఒకటి. ఈ విద్యా సంస్థ ప్రతి యేటా ఇచ్చే తమిళ ఆకాడెమీ 2017 అవార్డులను వెల్లడించింది.

దేశంలో వున్న అగ్రగామి డీమ్డ్ వర్శిటీల్లో ఒకటి చెన్నైలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఒకటి. ఈ విద్యా సంస్థ ప్రతి యేటా ఇచ్చే తమిళ ఆకాడెమీ 2017 అవార్డులను వెల్లడించింది. తమిళ సాహిత్యం, కవితలు, తమిళ భాషాభివృద్ధి, తమిళ మ్యాగజైన్, తమిళ సంగీతంతో పాటు మొత్తం 11 విభాగాల్లో ఈ అవార్డులను వెల్లడించింది. ఈ తరహా అవార్డులను వెల్లడించడం ఇది ఆరో సంవత్సరం కావడం గమనార్హం.
 
ఈ అవార్డుల కోసం మొత్తం 384 ఎంట్రీలు రాగా, వాటిని మూడు దశల్లో వడపోసి అవార్డు విజేతలను ఎంపిక చేశారు. ఇందుకోసం మద్రాసు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టీస్ పి.జ్యోతిమణి, తమిళనాడు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె.భాస్కరన్, కేంద్ర ప్రభుత్వం తమిళ ప్రాచీన భాషా విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి.ప్రకాశం, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సి.బాలుస్వామి, స్టెల్లా మేరీస్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉలగనాయకి పళనిలతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది. గత 2016 సంవత్సరంలో 295 ఎంట్రీలు వచ్చాయి. 
 
ఈ కమిటీ మొత్తం 12 విభాగాల్లో అవార్డులు వెల్లడించారు. అవార్డు విజేతల్లో డాక్టర్ ఎం.రాజేంద్రన్, పి.ముత్తుస్వామి, ఉదయశంకర్, టీఎన్.రామచంద్రన్, పి.ఎం.నటరాసన్, పి.సుబ్రమణియన్, అంగాలన్, పి.తిరుజ్ఞానసంబంధం, ఎస్.కుమాన రాసన్, ప్రొఫెసర్ చెల్లప్పన్, ప్రొఫెసర్ కందస్వామిలు ఉన్నారు.
 
అలాగే, తొల్కాప్పియర్ తమిళ అసోసియేషన్ అవార్డులు మూడు వుండగా, వాటిలో తమినాడు విభాగంలో వీజీపీ ప్రపంచ తమిళ సంఘానికి ఇచ్చారు. అలాగే, ఇతర రాష్ట్రాల విభాగంలో బెంగుళూరు తమిళ సంఘానికి, విదేశీ విభాగంలో తైవాన్ తమిళ సంఘానికి అవార్డులు ఇచ్చారు. ఒక్కే అవార్డుకు రూ. లక్ష, రూ.1.25 లక్షలు, రూ.1.50 లక్షలు, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు చొప్పున మొత్తం 22 లక్షల రూపాయలను బహుమతిగా అందజేయనున్నారు. కేంద్ర సాహిత్య అకాడెమీ ఇచ్చే బహుమతి నగదు కంటే తమిళ్ పేరరింజ్ఞర్ అవార్డుకు ఏకంగా రూ.5 లక్షల వరకు నగదు బహుమతిని అందచేయనున్నారు. ఈ మొత్తాన్ని ఎస్ఆర్ఎం వర్శిటీ కులపతి డాక్టర్ పారివేందర్ వ్యక్తిగత నిధి నుంచి అందజేస్తున్నారు. ఈ విషయాలను శుక్రవారం చెన్నై నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ వర్శిటీ ప్రో వైస్ ఛాన్సెలర్ టీపీ గణేశన్, తమిళ అకాడెమీ ప్రొఫెసర్లు వెల్లడించారు.