శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (09:20 IST)

చెన్నై ఎయిర్ పోర్టులో వ్యక్తి హంగామా.. రన్ వేపైకి వచ్చి..?

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. రన్ వే వద్దకు దూసుకెళ్లి.. విమానం కొనేందుకు వచ్చానన్నాడు. తద్వారా తమిళనాడు రాజధాని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత డొల్లతనాన్ని ఈ ఘట

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. రన్ వే వద్దకు దూసుకెళ్లి.. విమానం కొనేందుకు వచ్చానన్నాడు. తద్వారా తమిళనాడు రాజధాని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత డొల్లతనాన్ని ఈ ఘటన బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ఒక వ్యక్తి చెన్నై ఎయిర్‌పోర్ట్‌‌లో వీఐపీలు వెళ్లే గేట్‌ నుంచి లోపలికి ప్రవేశించాడు. నేరుగా రన్‌ వేపైకి వెళ్లిపోయి అటూ ఇటూ తిరగడం ప్రారంభించాడు. 
 
అతనిని సీసీటీవీ పుటేజ్‌లో చూసిన భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని విచారణ ఆరంభించారు. విచారణలో తాను విమానం కొనేందుకు వచ్చానని ఆ వ్యక్తి చెప్పాడు. ఇంకా పొంతనలేని మాటలు చెప్పడంతో అతని పూర్తి వివరాలు ఆరాతీశారు. అతని మానసిక స్థితి సరిగాలేదని నిర్ధారించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముందుజాగ్రత్త చర్యగా ఎయిర్ పోర్ట్‌కు హై అలెర్ట్ ప్రకటించారు.