1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:44 IST)

రుణ గ్రహీతలకు తీపికబురు.. యధాతథంగా కీలక వడ్డీరేట్లు

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణ గ్రహీతలకు తీపికబురు అందించింది. కీలకమైన వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. కీలకమైన పాలసీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ తెలిపింది. దీంతో రెపో రేటు 4 శాతం వద్దనే నిలకడగా కొనసాగుతోంది. రివర్స్ రెపో 3.35 శాతం వద్ద స్థిరంగా ఉంది.
 
రిజర్వు బ్యాంక్ 2020 మే 22న చివరిగా కీలకమైన పాలసీ రేట్లను సవరించింది. అప్పటి నుంచి రేట్లు స్థిరంగాన ఉంటూ వస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం వల్ల రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. 
 
రుణ రేట్లు కూడా స్థిరంగానే కొనసాగే అవకాశముంది. పెరగకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంకులు రుణ రేట్లను మరింత తగ్గించే ఛాన్స్ కూడా ఉంది. రుణ గ్రహీతలకు ఇది ఊరట కలిగే అంశమని చెప్పుకోవచ్చు. కేంద్ర బడ్జెట్ 2021-22 తర్వాత ఆర్‌బీఐ తన మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం గమనార్హం.