Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మకాయ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయ్.. తెలుసా?

Updated: మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (15:34 IST)
నిమ్మకాయ ధరలు భారీగా పెరిగిపోయాయి. రికార్డు స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో ఒక నిమ్మకాయ రిటైల్ షాపులో ఏకంగా రూ.10 వరకూ అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. విడి రోజుల్లో రూ.20లకు దాదాపు డజనకు పైనే నిమ్మకాయలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ పదిరూపాయలు అమ్ముతున్నారు. 
 
ఇందుకు ఇటీవల కురిసిన భారీ వర్షాలే కారణం. ఇంకా నిమ్మ పంట మీద తీవ్ర ప్రభావాన్ని చూపించినట్లు చెబుతున్నారు. ఈ కారణంగా నిమ్మ పంట భారీగా నష్టపోవటంతో నిమ్మకాయ ధర భారీగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. రిటైల్ మార్కెట్‌లో నిమ్మకాయ ఒక్కొక్కటి రూ.10 చొప్పున పలుకుతుంటే.. ఇక హోల్‌సేల్‌గా చిన్న సిమెంటు బస్తాల లెక్కన అమ్ముతుంటారు. 
 
ఒక బస్తా నిమ్మకాయల ధర ఏకంగా రూ.15,500 పలకటం ఒక రికార్డుగా చెబుతున్నారు. తాజాగా పెరిగిన ధరల కారణంగా గడిచిన 60 ఏళ్లలో ఎప్పుడూ పలకనంత భారీగా రేట్లు పలుకుతున్నాయి. గత ఏడాది నిమ్మకాయల బస్తా రేటు గరిష్ఠంగా రూ.9వేల వరకూ పలికిందని.. అప్పటికి అదే రికార్డు అని.. తాజాగా మాత్రం పాత రికార్డు ధరలకు ఏ మాత్రం పోలిక లేని రీతిలో రూ.15,500 పలకటం ఇదే తొలిసారిగా చెప్తున్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments