శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Modified: బుధవారం, 11 సెప్టెంబరు 2019 (09:51 IST)

గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందాలనుకుంటున్నారా?

సీజన్ మారిందంటే చాలామంది జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉంటారు. దీంతోపాటు గొంతునొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇన్ఫెక్షన్ కారణంగా చల్లటి పానీయాలు సేవించడం, నోరు శుభ్రంగా లేకపోవడం, నోటిలో పుండ్లు ఉన్నప్పుడు గొంతు సమస్యలు వచ్చి ఆహారం సేవించకుండా, మాట్లాడనివ్వకుండా చేస్తుంది. దీని నుంచి బయట పడాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.
 
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె, సగం స్పూన్ నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగితే గొంతు నొప్పి బాగా తగ్గిపోతుంది. అంతే కాకుండా గొంతు నొప్పి ఉంటే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ పళ్ళరసం వెనిగర్, ఒక స్పూన్ తేనెరసం వేసుకోవాలి. 
 
ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు లేక మూడుసార్లు తీసుకుంటే ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని పొక్కిలించినా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలలో మిరియాల పొడి కలుపుకుని తాగితే అది కూడా మంచిదంటున్నారు వైద్య నిపుణులు.