ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:38 IST)

గ్యాస్ సిలిండర్లపై కేంద్రం పరిమితి.. యేడాదికి 15 మాత్రమే!

LPG Cylinder
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రతి కుటుంబానికి కేంద్రం అందజేసే సిలిండర్ల సంఖ్యను 15కే పరిమితం చేయనుంది. ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు అయినా వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ, ఇకపై ఒక కుటుంబానికి 15 సిలిండర్లకు మంచి ఇవ్వరు. ఒకవేళ అదనపు సిలిండర్లు కావాలంటే తగిన డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది.

మీడియాలో వస్తున్న కథనాల మేరకు ఒక కుటుంబం ఒక సంవత్సరానికి గరిష్టంగా 15 సిలిండర్లు మాత్రమే పొందగలుగుతుంది. నెలకు 2కు మించి సిలిండర్లు పొందలేరు. కానీ, ఇప్పటివరుక ఎల్పీజీ సిలిండర్లపై ఎలాంటి కోటా లేకపోలు. ఒకవేళ ఎవరికైన ఒక నెలలో రెండు సిండర్లు కావాలంటే ఆ అవసరానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది.

ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయిన వంట గ్యాస్ ధరలతో సామాన్య ప్రజానీకం అల్లాడిపోతున్నారు. గత ఐదేళ్ల కాలంలో 58 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. కేంద్ర పెట్రోలియం శాఖ అధికారిక డేటా ప్రకారం 2017 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2022 జూలై 6వ తేదీ వరకు గ్యాస్ సిలిండర్ ధర 45 శాతం మేరకు పెరిగింది.

2017 ఏప్రిల్ నెలలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.723గా ఉండగా అది ఇపుడు రూ.1053కు పెరిగింది. ఈ సిలిండర్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి.