గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (16:31 IST)

ఆ నగరాల్లో రూ.750కే వంట గ్యాస్ సిలిండర్

lpg cylinder
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్ సిలిండర్ ధరలు పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ పెద్ద గుదిబండలా తయారయ్యాయి. ఈ ధరలు ప్రతి ఒక్క కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 14.2 కేజీల గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర ప్రస్తుతం దాదాపు రూ.1100 వరకు పలుకుతోంది. దీంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ఇండియన్ ఆయిల్ కంపెనీ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం కింద 28 నగరాల్లో రూ.750కే వంట గ్యాస్ సిలిండర్‌ను పంపిణీ చేయనుంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో లభించే సాధారణ సిలిండర్ ధర కంటే రూ.300 తక్కువగా ఉంది. 
 
ఈ పథకం అమలు కోసం ఇండేన్ కాంపోజిట్ సిలిండర్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇది సాధారణ సిలిండర్‌తో పోల్చితే బరువు తక్కువగా ఉంటుంది. అంటే కేవలం 10 కేజీల గ్యాస్ అందుబాటులో ఉంటుంది. అందుకే దీని ధర కూడా తక్కువగా ఉంటుంది. పైగా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తీసుకెళ్లవచ్చు.
 
ఈ సదుపాయాన్ని తొలుతు 28 నగరాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ సిలిండర్లను అందించనుంది. మరోవైపు, దేశీయంగా ఎల్పీజీ సిలిండర్ ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం సంబంధిత ఆయిల్ కంపెనీలకు భారీ మొత్తంలో రాయితీ ఇవ్వాలని భావిస్తుంది.