గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 7 సెప్టెంబరు 2022 (14:53 IST)

జియో కొత్త రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్.. 365 రోజుల వ్యాలిడిటీ.. 2.5 జీబీ డేటా

jioservice
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టెలికాం ఆపరేటర్ తమ జియో యూజర్ల కోసం అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT బెనిఫిట్స్ అందిస్తోంది. తాజాగా రిలయన్స్ జియో కొత్త రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2.5GB డేటాను అందిస్తుంది.
 
స్పెషల్ జియో 6వ వార్షికోత్సవ ఆఫర్ ప్లాన్‌తో పాటు ఇతర వార్షిక ప్రీపెయిడ్ ప్యాక్‌లను కూడా అందిస్తుంది. జియో ప్రస్తుతం రూ. 4199, రూ. 2,999, రూ. 2879, రూ. 2545 ధరలతో నాలుగు వార్షిక ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు గరిష్టంగా 3GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, OTT సబ్‌స్క్రిప్షన్, Jio యాప్ సర్వీసులకు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
 
వార్షిక రీఛార్జ్ పొందాలనుకుంటే.. అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT సబ్‌స్క్రిప్షన్, క్లౌడ్ స్టోరేజ్, మరిన్నింటిని పొందవచ్చు.  జియో ప్లాన్ myjio.com, My Jio యాప్‌లో అందుబాటులో ఉంది. ఇతర సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.  
 
365 రోజుల వ్యాలిడిటీ :
* 2.5GB డేటా లిమిట్‌తో 912.5GB మొత్తం డేటాను పొందవచ్చు.
* 1 ఏడాది పాటు ఫ్రీ డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్.
* JioCinema, JioTV, JioSecurity మరియు JioCloud ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్.
* 75GB అదనపు డేటా, Ajio, Netmeds Ixigo, Reliance Digital, Jio Saavn Pro కూపన్లు పొందవచ్చు.
* ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు.
* రోజుకు 100 SMS పొందవచ్చు.