శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 1 సెప్టెంబరు 2021 (22:01 IST)

పామ్ ఆయిల్ ప్రయోజనాలను నొక్కిచెబుతున్న మలేషియా పామ్ ఆయిల్ కౌన్సిల్

మలేషియా పామ్ ఆయిల్ కౌన్సిల్ (MPOC) ఆరోగ్య మరియు పోషకాహార రంగాలకు చెందిన ప్రముఖులు అధ్యక్షత వహించిన ఒక ఆకర్షణీయమైన వినియోగదారుల పరస్పర చర్యను నిర్వహించింది. ఈ కార్యక్రమం 30 ఆగస్టు 2021 న హోటల్ తాజ్ కృష్ణ, హైదరాబాద్‌లో జరిగింది. ఈ వినియోగదారుల పరస్పర చర్య యొక్క అంశం 'పామ్ ఆయిల్ యొక్క ఆరోగ్యం మరియు పోషకాహార ప్రయోజనాలు'.
 
వర్క్‌షాప్‌లో గృహిణుల నుండి చెఫ్‌లు, పారిశ్రామికవేత్తలు, ప్రత్యక్ష సంస్థాగత కస్టమర్లు, పంపిణీదారులు మరియు పరిశ్రమ నుండి అనేకమంది నిపుణులు మరియు సమర్థుల వరకు వివిధ రకాల టార్గెట్ వినియోగదారులు హాజరయ్యారు, పామాయిల్, దాని ప్రయోజనాలు మరియు మన దైనందిన జీవితంలో, ప్రత్యేకించి ఆహారంలో దాని అవసరం గురించి వారి జ్ఞానాన్ని పంచుకున్నారు.
 
ప్రొఫెసర్ డా. కేతన్ మెహతా, MD (Med), FCPS, FICP, FISE, FGSI, ఆహారంలో చిన్న మార్పులు ఎంత పెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తాయనే అంశంతో ఇంటరాక్షన్ ను ప్రారంభించారు. ముంబైలోని విశ్వసనీయ ఆసుపత్రులలో కార్డియోపల్మోనాలజిస్ట్ & డయాబెటాలజిస్ట్‌గా తన అనుభవాన్ని వర్క్‌షాప్‌లో వివరిస్తూ, అతను ఇలా తన అభిప్రాయాలను వెలిబుచ్చాడు, "మంచి ఎంపికలను చేసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంలో చాలా వ్యత్యాసం వస్తుంది. పామ్ ఆయిల్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న భారతదేశంలో వంట చేయడానికి ట్రాన్స్ ఫ్యాట్ లేని నూనెను ఉపయోగించడం ఆచరణీయమైన మరియు సరైన ఎంపికగా చేస్తుంది.

పామ్ ఆయిల్ అందించే పోషక సమతుల్యతను ఇతర వంట నూనెలు అందించడం చాలా అరుదని ఆయన అభిప్రాయపడ్డారు. "ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడానికి మానవ శరీరానికి అనేక రకాల పోషకాలు అవసరం. అయితే చాలా వంట నూనెలు అవసరమైన అన్ని పదార్థాలను కలిగి ఉండవు, కానీ పామ్ ఆయిల్ అటువంటి పోషకాల యొక్క మంచి సమతుల్యతను అందిస్తుంది.” 
 
దీని తరువాత మలేషియా పామ్ ఆయిల్ మరియు MPOC పై, MPOC, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్ మరియు శ్రీలంక ప్రాంతీయ అధిపతి శ్రీమతి భావనా షా ప్రజెంటేషన్ జరిగింది. శ్రీమతి షా పాల్గొన్నవారికి మలేషియన్ పామ్ ఆయిల్ మరియు దాని ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందించారు. MPOC ద్వారా చేపట్టబడిన వివిధ సాంకేతిక మరియు ఆర్థిక ప్రయోజనాలు మరియు పర్యావరణ స్థిరత్వంపై ఆమె హాజరైన వారికి సమాచారాన్ని అందించారు.
 
ఈ సందర్భంగా శ్రీమతి షా మాట్లాడుతూ, "మలేషియా పామ్ ఆయిల్ మరియు MPOC చేపట్టిన పని గురించి ఆర్థిక అవకాశాలను అందించడం మరియు పర్యావరణం పట్ల మన బాధ్యతను సమతుల్యం చేయడం గురించి జ్ఞానాన్ని పంచుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంటరాక్షన్ లో పరిశ్రమలోని నిపుణులందరికి మరియు సమర్థులకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
 
భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇంటరాక్షన్ల ద్వారా పామాయిల్ పోషక ప్రయోజనాలను పంచుకోవడానికి మేము ఎదురుచూస్తున్నాము. మలేషియా యొక్క పామ్ ఆయిల్ పరిశ్రమ 100 సంవత్సరాల పురాతన చరిత్ర గలది అలాగే ఈ ప్రయాణం పురోగమిస్తున్న కొద్దీ పెరిగిన వాటాదారులందరి మధ్య మరింత నమ్మకం ఏర్పడింది. మలేషియా మరియు MPOC లతో పరస్పర ప్రయోజనకరమైన మరియు సహకార సంబంధాన్ని నిర్మించే ఈ మరియు భవిష్యత్తు ఈవెంట్‌లలో పాల్గొనేవారి కోసం మేము ఎదురుచూస్తున్నాము.”
 
ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లో అసోసియేట్ రిటైర్డ్ ప్రొఫెసర్ మరియు సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ మీనా మెహతా ప్రెజెంటేషన్ ద్వారా ఈ కార్యక్రమం ముగిసింది. భారతదేశంలోని పట్టణవాసులు తీసుకునే ఆహారం అనారోగ్యకరమైన ధోరణిని చూపుతోందని మరియు ఇది కార్డియోవాస్కులర్ మరియు ఇతర వ్యాధుల పెరుగుదలకు మధ్య లింక్ అని ఆమె హెచ్చరించారు.

"జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం వలన దీర్ఘకాలిక నష్టం నుండి తప్పించుకోవచ్చు." భారతీయ డైటీటిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ మీనా ఇతర జీవనశైలి రుగ్మతలను తగ్గించడంలో ఆహారం ఎలా ప్రధాన పాత్ర పోషిస్తుందనే దానిపై కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు మరియు అందువల్ల పామ్ ఆయిల్ వంటి ప్రత్యామ్నాయాల వైపు ఆరోగ్యకరమైన మార్పిడి కోసం వాదించారు.