మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (21:12 IST)

ఉడాన్‌పై లభ్యం కానున్న కాస్కో యొక్క నూతన శ్రేణి పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తులు

భారతదేశపు సుప్రసిద్ధ స్పోర్ట్ప్‌, ఫిట్‌నెస్‌ ఉత్పత్తుల తయారీదారు కాస్కో (Cosco) ఇండియా నేడు తమ నూతన శ్రేణి పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తులను భారతదేశపు అతిపెద్ద బీ2బీ ఈ-కామర్స్‌ వేదిక ఉడాన్‌పై అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వ్యక్తిగత సంరక్షణ మార్కెట్‌లో అందుబాటు ధరలలో తమ ప్రీమియం ఉత్పత్తులను వినియోగదారులకు అందించాలనే కాస్కో ప్రయత్నాలను సైతం ఇది వెల్లడిస్తుంది.
 
పర్యావరణ అనుకూల కాస్కో పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తులు చెన్నై, కోయంబత్తూరు, త్రిచి, తిరువనంతపురం, వైజాగ్‌, కొచిన్‌లో  లభ్యం కానున్నాయి. దీని కోసం ఉడాన్‌ యొక్క విస్తృత శ్రేణి పంపిణీ నెట్‌వర్క్‌, బీ2బీ ఈ-కామర్స్‌ నైపుణ్యంపై కాస్కో ఆధారపడుతుంది.
 
కాస్కో ఇండియా లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ సీఈవో దేవెందర్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ ‘‘మా వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించి, మా ప్రస్తుత డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌తో పోలిస్తే మరింగా విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని కాస్కో వద్ద మేము గుర్తించాం. గత కొద్ది సంవత్సరాలుగా భారీ డిజిటల్‌ నెట్‌వర్క్‌ను ఉడాన్‌ నిర్మించింది.మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా రిటైలర్ల నమ్మకాన్ని పొందింది. మరిన్నిరిటైల్‌ ఔట్‌లెట్లకు చేరుకునేందుకు ఇది మాకు తోడ్పడనుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని అన్నారు.
 
వినయ్‌ శ్రీవాస్తవ, హెడ్‌-ఎఫ్‌ఎంసీజీ బిజినెస్‌, ఉడాన్‌ మాట్లాడుతూ, ‘‘మా వేదికపై కాస్కో యొక్క నూతన శ్రేణి ఉత్పత్తులు లభించడం పట్ల సంతోషంగా ఉన్నాం. విస్తృతశ్రేణి పంపిణీ నెట్‌వర్క్‌, రిటైలర్లతో ఉన్న అనుబంధం, ఈ-కామర్స్‌ వ్యాపారాల పట్ల లోతైన పరిజ్ఞానం కారణంగా జాతీయ, ప్రాంతీయ బ్రాండ్లకు ప్రాధాన్యతా భాగస్వామిగా ఉడాన్‌ నిలుస్తుంది’’ అని అన్నారు.