ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (16:25 IST)

రైతుల కోసం రూ.36వేల కొత్త పథకం.. రూ.55 నుంచి రూ.200ల దాకా కడితే..?

రైతుల కోసం రూ.36వేల పథకం వచ్చింది. చాలామంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం గురించి తెలియదు. పీఎం కిసాన్‌లో చేరిన వారైతే ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండానే ఈ పథకంలో చేరవచ్చు. ఇది ఒక రకమైన పెన్షన్ స్కీమ్.

ప్రతి నెల డబ్బులు వస్తాయి కాబట్టి ఆర్థికంగా ఇది ఉపయోగపడుతుంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కేంద్రం కోరుతుంది. ఇప్పటికే ఈ పథకంలో 21,23,809 మంది రైతులు చేరారు. రైతుల వయస్సు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. రైతులు 2 హెక్టార్లలోపు భూమిలో వ్యవసాయం చేస్తుండాలి. చిన్న, మధ్య తరహా రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
 
అర్హులైన రైతులు ఈజీగా ఈ పథకంలో చేరవచ్చు. ముందుగా ఈ వెబ్ సైట్‌ (https://pmkmy.gov.in)లోకి వెళ్లండి. అక్కడ కుడివైపున ఓ మూల క్లిక్ హియర్ టు అప్లై నౌ (Click here to apply now) అనే బాక్సు క్లిక్ చెయ్యాలి. ఓ కొత్త పేజీ తెరచుకుంటుంది. అక్కడ సెల్ఫ్ ఎన్‌రోల్‌మెంట్ (Self Enrollment) అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చెయ్యాలి. 
 
మొబైల్ నంబర్‌ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత పేరు, ఇతరత్రా మరికొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. రైతులు 60 ఏళ్లు దాటాక నిశ్చింతగా ఉండేందుకు కేంద్రం ఈ పథకం తెచ్చింది. దీన్ని అర్హులైన రైతులంతా ఉపయోగించుకోవాలని కోరుతోంది.
 
రైతుల వయస్సును బట్టి నెలకు ఎంత చెల్లించాలో నిర్ణయిస్తారు. నెలకు రూ.55 నుంచి రూ.200 దాకా చెల్లించవచ్చు. ఇలా 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు చెల్లించాలి. దీంతో 60 ఏళ్ల వయస్సు తర్వాత ప్రతి నెల రూ.3 వేలు పొందవచ్చు. అంటే సంవత్సరానికి రూ.36 వేలు.