బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 1 జులై 2021 (00:07 IST)

భారతదేశంలో బహుళ పొరల ప్లాస్టిక్స్‌ను రీసైకిల్‌ చేయడం కోసం పెట్టుబడులు పెట్టిన మాండెలెజ్‌ ఇండియా

మాండెలెజ్‌ ఇండియా నేడు హసిరు దాలాకు నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించింది. మల్టీ లేయర్డ్‌ ప్లాస్టిక్‌ (ఎంఎల్‌పీ) వ్యర్థాలను రీసైకిల్‌ చేయడంతో పాటుగా టేబుల్స్‌, బెంచిలు మరియు ఇతర అవసరాల కోసం సుస్థిరమైన ఫర్నిచర్‌ బోర్డులుగా మార్చడంను చేసే స్వచ్ఛంద సంస్థ హసిరు దాలా. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌లో భాగంగా సాంకేతికతను అంకుర సంస్థ ట్రాష్‌ కాన్‌ నుంచి కొనుగోలు చేసి వినియోగించనున్నారు. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం 600 టన్నుల ఎంఎల్‌పీని వావ్‌ బోర్డులుగా మలచనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ పర్యావరణ పరిష్కారాల కంపెనీ ఉబన్టూ సహకారం అందిస్తుంది.
 
‘‘భారతదేశంలో అత్యంత కీలకమైన సవాళ్లలో ఒకటిగా మౌలిక వసతుల అవరోధాల వల్ల మల్టీ లేయర్డ్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌ నిలుస్తుంది. ఒకవైపు మేము ప్రభుత్వాలకు వ్యర్థ సేకరణ, వేరు చేయడం మరియు రీసైక్లింగ్‌ పై పనిచేస్తూనే, వ్యర్థ నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకు తగిన పరిష్కారాలను అందిస్తూ బహుళ అంచెల ప్లాస్టిక్స్‌ను రీసైకిల్‌ చేసే కార్యక్రమాలు మరియు ఎంటర్‌ప్రైజింగ్‌ సాంకేతికతలకు  మద్దతునందిచడం కూడా అత్యంత కీలకంగా భావిస్తున్నాం.
 
ఈ వినూత్నమైన మరియు మొట్టమొదటి తరహా ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ మల్టీ లేయర్డ్‌ ప్లాస్టిక్స్‌ను వావ్‌ బోర్డ్స్‌గా సృష్టిస్తుంది.ఈ  వావ్‌ బోర్డ్స్‌ అత్యంత మన్నిక కలిగి ఉండడంతో పాటుగా భవంతులు, నిర్మాణ, ఫర్నిచర్‌ మరియు ఇతర అవసరాలకు సుస్ధిర ప్లైవుడ్‌కు ప్రత్యామ్నాయంగా కూడా నిలుస్తుంది. మేము హసిరు దాలాకు గ్రాంట్‌ను మంజూరు చేశాము. ఇది వ్యర్థాలను సంపదగా మార్చడంతో పాటుగా ఉపాధి కల్పన చేస్తూనే, ఆధారపడతగ్గ వ్యాపార నమూనాగా ఎంఎల్‌పీ విసిరే సవాళ్లను ఎదుర్కొని సుస్థిర పద్ధతిలో నిలుస్తుంది.
 
ఈ ప్రాజెక్ట్‌ విజయం మరియు దీని అభ్యాసాలు భారతదేశంలో కంపెనీలకు ఓ నమూనాను సృష్టించడంతో పాటుగా ఎంఎల్‌పీ రీసైక్లింగ్‌ను ప్రతిబింబించనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము’’ అని దీపక్‌ అయ్యర్‌, అధ్యక్షుడు– ఇండియా, మాండెలెజ్‌ ఇంటర్నేషనల్‌ అన్నారు.
 
‘‘ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తలతో ఉబన్టూ కలిసి పనిచేయడం ద్వారా భూగోళంపై అతిపెద్ద పర్యావరణ సవాళ్లను పరిష్కరిస్తుంది. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం మరీ ముఖ్యంగా ఉత్సాహపూరితమైనది ఎందుకంటే,  కేవలం ప్లాస్టిక్‌ వ్యర్థ సమస్యను పరిష్కరించడం మాత్రమే కాదు, భవంతులు, నిర్మాణ పరిశ్రమలు పర్యావరణంపై చూపే పెను ప్రభావాన్ని సైతం గణనీయంగా తగ్గించగల సామర్థ్యం కలిగి ఉంది’’ అని వెంకటేష్‌ కిని, కో ఫౌండర్‌, ఉబన్టూ అన్నారు.
 
ఈ కార్యక్రమంలో భాగంగా, ఎంఎల్‌పీ వ్యర్ధాలను హసిరు దాలా యొక్క విస్తృత శ్రేణిలోని వ్యర్థసేకరణ నెట్‌వర్క్‌ చేయడంతో పాటుగా ఆ తరువాత బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యూనిట్‌లో రీసైకిల్డ్‌ వావ్‌ బోర్డులుగా వాటిని మారుస్తుంది. ఈ బోర్డులు అత్యున్నత మన్నిక కలిగినవి మరియు ప్లైవుడ్‌కు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాలుగానూ నిలుస్తాయి. ఈ సాంకేతిక పరిష్కారాన్ని ట్రాష్‌కాన్‌ అందిస్తుంది.
 
వ్యర్థ రీసైక్లింగ్‌ యంత్ర సామాగ్రి తయారీదారు, అంకుర సంస్థ ట్రాష్‌కాన్‌. పారిశ్రామిక, గృహ వినియోగదారులు పలు కారణాల కోసం వినియోగించే అత్యంత మన్నిక కలిగిన వావ్‌ బోర్డులను దాలా  రూపొందించనుంది. ఈ కార్యక్రమానికి మాండెలెజ్‌ ఇండియా నిధులను అందించినప్పటికీ, తమ ఇంపాక్ట్‌ ఇన్వెస్టింగ్‌ ఆర్మ్‌, సస్టెయినబల్‌ ఫ్యూచర్స్‌తో భాగస్వామ్యం చేసుకుని జులై 2021 లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించనుందని అంచనా.
 
‘‘బెంగళూరులో స్ధానిక ప్రభుత్వంతో హసిరు దాలా  కలిసి పనిచేయడంతో పాటుగా ఎన్నో సంవత్సరాలుగా ఇనార్గానిక్‌ వ్యర్థ నిర్వహణలో పనిచేస్తూ వ్యర్ధ సేకరణ దారుల నుంచి వ్యవస్ధాపకులను సృష్టించింది. మేము ఎల్లప్పుడూ మల్టీ లేయర్డ్‌, అతి తక్కువ విలువ కలిగిన ప్లాస్టిక్‌ పరిష్కారాలను గురించి చూస్తుంటాం. 2018లో వచ్చిన ఓ అధ్యయనం వెల్లడించిన దాని ప్రకారం, సేకరించే 80% ప్లాస్టిక్‌ వ్యర్ధాలు అతి తక్కువ విలువ కలిగినవి మరియు ఇవి కేంద్రాలకు ఎలాంటి ఆదాయమూ తీసుకురావు. అవి సాధారణంగా ల్యాండ్‌ఫిల్స్‌లో చేరిపోవడం లేదా  సిమెంట్‌ క్లిన్స్‌లో చేరిపోవడం జరుగుతుంది. వావ్స్‌బోర్డులు వ్యర్థ సేకరణ దారులకు ఆదాయం తీసుకువస్తాయి మరియు చెక్క ఆధారిత షీట్లకు ప్రత్యామ్నాయంగా నిర్మాణ, ఫర్నిషింగ్స్‌లో నిలుస్తాయి’’ అని నళిని శేఖర్‌, కో–ఫౌండర్‌, హసిరు దాలా అన్నారు.
 
‘‘ట్రాష్‌కాన్‌వద్ద, మేము పేటెంటెడ్‌ సాంకేతికతపై పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ఇళ్లు, వీధులు ఆఖరకు ల్యాండ్‌ఫిల్స్‌ నుంచి వచ్చే వ్యర్థాల నుంచి వచ్చే ఎంఎల్‌పీని సైతం మార్చి చెక్కకు ప్రత్యామ్నాయంగా నిలుపుతుంది. తద్వారా ప్లాస్టిక్‌ సమస్యకు పరిష్కారం అందించడంమాత్రమే కాదు పెద్ద సంఖ్యలో చెట్లను నరికి వేయడాన్నీ అడ్డుకుంటుంది. మాండెలెజ్‌ ఇండియా ఇప్పుడు హసిరు దాలాకు ఈ ట్రాష్‌కాన్‌ సాంకేతికత స్వీకరణలో మద్దతునందించడం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని నివేధా ఆర్‌ఎం , ఫౌండర్‌, ట్రాష్‌కాన్‌ అన్నారు.
 
తమ పర్యావరణ ప్రభావం తగ్గించుకుంటామనే మాండెలెజ్‌ ఇంటర్నేషనల్‌ నిబద్ధతలో భాగంగా, తమ వ్యాపారానికి అనుగుణంగా ప్లాస్టిక్‌తో సహా ఎదురవుతున్న అతిపెద్ద సస్టెయినబిలిటీ సవాళ్లను పరిష్కరించడానికి  మాండెలెజ్‌ కట్టుబడి ఉంది. మాండెలెజ్‌ ఇండియా యొక్క ప్యాకేజింగ్‌లో దాదాపు 97% ను రీసైకిల్‌ చేసే రీతిలో డిజైన్‌ చేశారు. 2019–2020 మరియు 2020–21 లో ఈ కంపెనీ భారతదేశంలో విస్తరించిన ఉత్పత్తిదారుని బాధ్యతను 100% చేరుకుంది.