బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 మే 2023 (21:37 IST)

భారతదేశంలో వినియోగదారులు- వారి కుటుంబసభ్యుల కోసం మొట్టమొదటిసారిగా మూవ్‌ ఆరోగ్య భీమా పథకం

ప్రపంచంలో మొట్టమొదటి మొబిలిటీ ఫిన్‌టెక్‌, మూవ్‌ నేడు రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం చేసుకుని సమగ్రమైన ఆరోగ్య భీమా కవరేజీ పథకాన్ని భారతదేశంలోని తమ వినియోగదారులు మరియు వారి కుటుంబాల కోసం ప్రకటించింది. పరిశ్రమలో మొట్టమొదటి సారిగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆర్ధిక సేవలను ప్రజాస్వామ్యీకరించడం ద్వారా అంతర్జాతీయంగా మొబిలిటీ వ్యవస్థాపకులకు సాధికారిత కల్పించాలనే మూవ్‌  లక్ష్యంలో భాగం. ఈ బీమా ప్యాకేజీ వినియోగదారులు మరియు వారి భార్య మరియు ఇద్దరు పిల్లలకు రెండు లక్షల రూపాయల వరకూ కవరేజీని అందిస్తుంది. ఈ ప్రారంభం, తమ వినియోగదారులకు మద్దతు అందించడంతో పాటుగా మొత్తంమ్మీద వారి జీవిత నాణ్యతను మెరుగుపరచాలనే మూవ్‌ యొక్క  నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.
 
మొట్టమొదటి సారిగా ప్రారంభించిన ఈ వినియోగదారుల లక్ష్యిత కార్యక్రమం పట్ల తమ సంతోషాన్ని మూవ్‌ ఇండియా మరియు దక్షిణాసియా హెడ్‌ బినోద్‌ మిశ్రా వెల్లడిస్తూ ‘‘ఒక సంవత్సరం లోపుగానే, స్ధిరమైన ఉపాధి కల్పన లక్ష్యం చేరుకోవడంతో పాటుగా తమ వినియోగదారులకు ఎస్సెట్‌ యాజమాన్యానికి సంబంధించిన మార్గమూ వేసింది.
 
మా వినియోగదారులతో పాటుగా వారి కుటుంబాల కోసం ఆరోగ్య భీమా కవరేజీ అందించడం ద్వారా మేము కేవలం వారి భద్రతకు భరోసా అందించడం మాత్రమే కాదు, తమ ప్రియమైన  వారి సంక్షేమానికీ భరోసా అందించడం ద్వారా పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తున్నాము. ఈ ఆఫరింగ్‌, భారతదేశంలో మొబిలిటీ ఎంటర్‌ప్రిన్యూర్స్‌ మరియు వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచాలనే మూవ్‌ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది’’అని అన్నారు. మూవ్‌ యొక్క  డ్రైవ్‌–టు–ఓన్‌ నమూనాతో వినియోగదారులు కేవలం 48 గంటలలో వాహన యజమానులుగా మారగలరు. అతి తక్కువ అద్దె ఫీజులు, సౌకర్యవంతమైన పనిగంటలు, నిర్వహణ  బాధలూ ఉండవు.  ప్రకటనల ప్రచారాల ద్వారా ఆదాయ పంపిణీ నుంచి కూడా వినియోగదారులు ప్రయోజనం పొందగలరు. దీనితో పాటుగా కాల వ్యవధి అనుసరించి పార్కింగ్‌ హాలీడేస్‌ అందించడంతో పాటుగా  వినియోగదారులతో పాటుగా వారి కుటుంబసభ్యులకూ ఆరోగ్య భీమా లభిస్తుంది. ఇది మూవ్‌ను సురక్షితమైన మరియు స్దిరమైన ప్రత్యామ్నాయంగా మొబిలిటీ వ్యవస్ధాపకులకు మార్చడంతో పాటుగా స్వతంత్య్రంగా నిలువాలనే వారి ప్రయత్నంలో తోడ్పాటునూ అందిస్తుంది.
 
మానసిక ప్రశాంతతను అందించడం కోసం తిరిగి చెల్లించతగిన డిపాజిట్లను సైతం మూవ్‌ అందిస్తుంది. అలాగే తమ లక్ష్యాలను సాధించడానికి  శ్రమించిన వారికి వారాంతపు ప్రోత్సాహాలనూ అందిస్తుంది.  ఈ కంపెనీ ప్రస్తుతం 2వేల మంది వినియోగదారులను కలిగి ఉంది. వీరంతా కూడా మూవ్‌ ఫైనాన్స్‌డ్‌ వాహనాలను  నడుపుతున్నారు. అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో  5000 వాహనాలను విడుదల చేయడానికి ప్రణాళిక చేసింది.  రాబోయే కాలంలో మరింతగా దీనిని విస్తరించనుంది. ఈఎంఈఏ లో ఉబెర్‌కు అతి పెద్ద సరఫరా భాగస్వామిగా మూవ్‌ నిలిచింది మరియు భారతదేశంలో  అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన రైడ్‌ షేరింగ్‌ లీడర్‌ తో భాగస్వామ్యం చేసుకుని 2022లో ప్రారంభించింది.