గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (09:35 IST)

మార్చి లేదా ఏప్రిల్ 2024లో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు

5gspectrum
జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్రస్తుతం తమ వినియోగదారులకు 5G సేవలను అందజేస్తుండగా, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ తన వినియోగదారులకు 3G సేవలను మాత్రమే అందిస్తోంది. 
 
బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, 2023లో 4జీ, 2024లో 5జీ సేవలను అందిస్తామని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 
 
ఈ ఏడాది బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు 4జీ సేవలందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మార్చి లేదా ఏప్రిల్ 2024లో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.