గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2022 (17:19 IST)

దీపావళి రోజున ఉద్యోగులకు షాకిచ్చిన ఫిలిప్స్..

philips
దీపావళి పండుగ రోజున ఉద్యోగులకు ఫిలిప్స్ కంపెనీ తేరుకోలేని షాకిచ్చింది. ఏకంగా నాలుగు వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలిపింది. మరోమార్గం లేకే ఈ ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. 
 
దేశంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఉపకరణాల దిగ్గజం ఫిలిప్స్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు దీపావళి రోజున ఓ ప్రకటన చేసింది. మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి సమయంలో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. 
 
ఉద్యోగుల్లో చురుకుదనాన్ని పెంచి, ఉత్పాదకతను ఇనుమడింపజేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఫిలిప్స్ సీఈఓ రాయ్ జాకబ్ తెలిపారు. కంపెనీ మూడో త్రైమాసికం ఫలితాలను వెల్లడిస్తూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. 
 
మూడో త్రైమాసికంలో నిర్వహణ, సరఫరా రంగ సవాళ్లు ఫిలిప్స్ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపాయో ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో బాధగా ఉన్న, ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకోక తప్పలేదని రాయ్ జాకబ్స్ విచారం వ్యక్తం చేశారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిలిప్స్‌ను మల్లీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇవి ప్రారంభ చర్యలు అని భావిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ తొలగింపులో ప్రభావితమయ్యే ఉద్యోగుల భవితవ్యాన్ని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని, వారికి ఊరట కలిగించే విధంగా విధి విధానాలు అమలు చేస్తామని తెలిపారు.