ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (18:15 IST)

విప్రో తరహాలో ఫేస్‌బుక్‌లోనూ ఉద్యోగులపై వేటు.. 12వేల మంది?

విప్రో తరహాలో ఫేస్‌బుక్‌లోనూ ఉద్యోగులపై వేటు పడనుంది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాలో పలు టీముల నుంచి 12 వేల మంది ఉద్యోగులను తొలగించవచ్చని ప్రచారం జరుగుతోంది. రాబోయే వారాల్లో లే ఆఫ్స్ కు అనుగుణంగా అడుగులు పడతాయని తెలుస్తోంది. 
 
తాజా నియామకాలను నిలిపివేశామని ఇటీవలే మెటా ఎర్నింగ్స్ కాల్‌లో మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. దీంతో  మొత్తం 15 శాతం మంది ఉద్యోగులపై వేటు పడవచ్చని తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
 
చాలా కంపెనీలు ఈ నష్టాలను అధిగమించేందుకు ప్రధానంగా ఉద్యోగాల్లోనే కోత విధిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం దృష్ట్యా మ్యాన్ పవర్ తగ్గించి నష్టాలు పూడ్చుకోవాలని చూస్తున్నాయి.