వారంలో 3 రోజులు ఆఫీసులకు రావాల్సిందే.. టీసీఎస్
కరోనా తర్వాత ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ప్రయత్నాలు మెుదలు పెట్టింది టీసీఎస్. 2025 నాటికి హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అమలు చేయాలని కంపెనీ యోచిస్తోంది.
అయితే దీనికి ముందు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించి కరోనా ముందు నాటి పరిస్థితులను తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇకపై ఉద్యోగులు వారంలో 3 రోజుల పాటు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఇక మహీంద్రా అండ్ మహీంద్రా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాట మర్చిపోమని తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. ఇతర ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగుల నియామకం సమయంలోనే నో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేస్తున్నాయి.